పండుగకు డ్రెస్‌ కొనివ్వలేదని.. నదిలో దూకిన 12 ఏళ్ల బాలుడు

పండుగ పూట తల్లి తండ్రులు కొత్త డ్రెస్‌ కొనివ్వలేదని నిరాశ చెందిన బాలుడు తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. కొత్త బట్టలు తేలేదని 12 ఏళ్ల బాలుడు నదిలో దూకాడు.

By అంజి  Published on  25 Oct 2023 12:45 PM IST
Durga Puja, Assam, Gadadhar River

పండుగకు డ్రెస్‌ కొనివ్వలేదని.. నదిలో దూకిన 12 ఏళ్ల బాలుడు

పండుగ పూట తల్లి తండ్రులు కొత్త డ్రెస్‌ కొనివ్వలేదని నిరాశ చెందిన బాలుడు తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. దుర్గాపూజకు కొత్త బట్టలు తేలేదని 12 ఏళ్ల బాలుడు నదిలో దూకాడు. ఈ ఘటన అస్సాంలోని ధుబ్రి జిల్లాలో చేసుకుంది. గోలక్‌గంజ్‌ ప్రాంతంలో సోమవారం నాడు ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. సుమన్ రాయ్‌గా గుర్తించబడిన మైనర్ బాలుడు గైఖోవా గాంధీగ్రామ్ మిడిల్ స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్నాడు. డ్రెస్‌ కొనివ్వకపోవడంతో నిరాశకు, నిరుత్సాహానికి గురయ్యాడని బాలుడి కుటుంబ సభ్యులు వెల్లడించారు.

దీంతో చుట్టుపక్కల వారందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తూ సుమన్ గదాధర్ నదిలో పడిపోవాలని నాటకీయ నిర్ణయం తీసుకున్నాడు. సమీపంలోని ఇంటి యజమానుల నుండి సమాచారం అందుకున్న పోలీసులు, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించారు. దురదృష్టవశాత్తు బాలుడు ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. తప్పిపోయిన బాలుడి ఆచూకీ కోసం ఇంకా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ధుబ్రి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ నవీన్ సింగ్ తెలిపారు.

Next Story