శుభవార్త.. ఉపాధి హామీ కూలీల వేతనం పెంపు

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉపాధి హామీ పథకం కూలీల వేతనాలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

By అంజి
Published on : 29 March 2025 10:12 AM IST

MGNREGS FY25-26, Central Govt, increases wages, unskilled manual workers

శుభవార్త.. ఉపాధి హామీ కూలీల వేతనం పెంపు

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉపాధి హామీ పథకం కూలీల వేతనాలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కార్మికులకు వేతనాలను కేంద్రం పెంచింది. నవీకరించబడిన వేతనాలు ఏప్రిల్ 1, 2025 నుండి అమలులోకి వస్తాయి.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రూ.300 నుంచి రూ.307కి పెంచింది. 2024 - 25 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు రూ.7 పెరిగింది. హర్యానాలో అత్యధికంగా రోజుకు రూ.400 వేతనాలు నమోదయ్యాయి. ఉపాధి హామీ వేతనాలు రోజుకు రూ.400కు చేరుకోవడం ఇదే మొదటిసారి. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాలాండ్, తెలంగాణలలో వేతనాలు రూ.7 పెరిగాయి. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ కార్మికులకు రోజుకు అతి తక్కువ వేతనం రూ.241 లభిస్తుంది.

మహాత్మా గాంధీ NREGA దేశవ్యాప్తంగా గ్రామీణ కుటుంబాల జీవనోపాధి భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది, దీనిలో ప్రతి గ్రామీణ కుటుంబంలోని వయోజన సభ్యులు నైపుణ్యం లేని శారీరక శ్రమ చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు రావచ్చు. వారికి ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 100 రోజుల హామీ వేతన ఉపాధి లభిస్తుంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వేతనాలు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో గోవాలో గరిష్టంగా 10.56 శాతం పెంపుదల నమోదు కాగా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో అత్యల్పంగా 3.04 శాతం పెంపుదల నమోదైంది.

రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాల వారీగా రోజుకు వేతన రేటు (రూ.లలో)

ఆంధ్రప్రదేశ్- రూ. 307

బీహార్- రూ. 255

హర్యానా- రూ. 400

జార్ఖండ్- రూ. 255

మధ్యప్రదేశ్- రూ. 261

మహారాష్ట్ర- రూ. 312

పంజాబ్- రూ. 346

రాజస్థాన్- రూ. 281

పశ్చిమ బెంగాల్- రూ. 260

తెలంగాణ- రూ. 307

తమిళనాడు- రూ. 336

మేఘాలయ- రూ. 272

Next Story