లండన్‌కు టేకాఫ్ అయిన తర్వాత ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్‌లో కూలిపోయింది. అయితే కూలిపోడానికి కొన్ని నిమిషాల ముందు విమానం నుండి మేడే కాల్ జారీ అయిందని పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ ఒక ప్రకటనలో తెలిపింది.
అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన నిమిషాలకే ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. లండన్‌కు వెళ్తున్న విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రమాద దృశ్యాలలో విమానాశ్రయం చుట్టుపక్కల దట్టమైన పొగలు కమ్ముకున్నట్లు కనిపించింది.
"మేడే కాల్" అనేది రేడియో డిస్ట్రెస్ సిగ్నల్. ఇది సాధారణంగా ఓడలు, విమానాలలో ఉంటుంది. తక్షణ సహాయం అవసరమైనప్పుడు లేదా అత్యవసర పరిస్థితిని సూచిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. ప్రమాదాన్ని సూచించే అత్యవసర కాల్.