ముంబైలో భారీ అగ్నిప్ర‌మాదం.. ఎగిసిప‌డుతున్న అగ్నికీల‌లు

Massive fire breaks out in residential building in Mumbai.ముంబైలో భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. ఈ ప్ర‌మాదంలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Oct 2021 2:44 PM IST
ముంబైలో భారీ అగ్నిప్ర‌మాదం.. ఎగిసిప‌డుతున్న అగ్నికీల‌లు

ముంబైలో భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. ఈ ప్ర‌మాదంలో ఓ వ్య‌క్తి మృతి చెందాడు. ద‌క్షిణ ముంబైలోని ప‌రేల్‌లోని లాల్ బాగ్ కర్రీ రోడ్‌‌లోని అవిగ్న అపార్ట్ మెంట్‌లో శుక్ర‌వారం మ‌ధ్యాహ్నాం అగ్నిప్ర‌మాదం చోటుచేసుకుంది. అపార్టుమెంట్‌లోని 19వ అంత‌స్థులో ఒక్క‌సారిగా భారీగా మంట‌లు ఎగిసిప‌డ్డాయి. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది వెంట‌నే 12 పైర్ ఇంజిన్ల‌తో అక్క‌డ‌కు చేరుకుని మంట‌ల‌ను ఆర్పేందుకు య‌త్నిస్తున్నారు. భారీ ఎత్తున అగ్నికీల‌లు ఎగిసిప‌డుతుండ‌డంతో ద‌ట్ట‌మైన పొగ అలుముకుంది.

60 అంత‌స్తులు ఉన్న ఈ అపార్టుమెంట్‌లో 19వ అంత‌స్తులో ఓ వ్య‌క్తి త‌న ప్రాణాలు కాపాడుకునేందుకు బాల్క‌నీలోకి వ‌చ్చి అక్క‌డ ఉన్న గ్రిల్స్ ప‌ట్టుకుని కింద‌కు దిగాల‌ని ప్ర‌య‌త్నించాడు. అయితే.. అదుపు త‌ప్పి కింద ప‌డి ప్రాణాలు కోల్పోయాడు. మ‌రికొంత మంది మంటల్లో చిక్కుకున్న‌ట్లు తెలుస్తోంది. మంట‌లు అదుపులోకి వ‌స్తే గానీ.. ప్రాణ‌, ఆస్తి న‌ష్టం పై పూర్తి స‌మాచారం తెలియ‌నుంది. కాగా.. అగ్నిప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది.

Next Story