ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం
Massive fire breaks out in Delhi.దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దక్షిణ ఢిల్లీలోని
By తోట వంశీ కుమార్ Published on
12 Jun 2021 8:44 AM GMT

దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దక్షిణ ఢిల్లీలోని లాజ్‌పత్ నగర్ సెంట్రల్ మార్కెట్ ప్రాంతంలోని ఓ షోరూమ్‌లో శనివారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు ఎగిసి పడడంతో క్షణాల్లో చుట్టుపక్కల ఉన్న దుకాణాలకు వ్యాప్తించాయి. అక్కడ వస్త్ర దుకాణాలే ఎక్కువ ఉండడంతో మంటలు వేగంగా వ్యాప్తి చెందాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదం జరగడంతో ప్రాంతంలో పొగ కమ్మివేసింది.
లజపత్ నగర్ సెంట్రల్ మార్కెట్‌లో, బ్లాక్ 1 సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారులు తెలిపారు. మంటలు ఎంతసేపటికీ అదుపులోకి రాకపోవడంతో 30 ఫైరింజన్ల సాయంతో సహాయచర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరిగినట్లు ఇప్పటివరకు సమాచారం లేదని అధికారులు తెలిపారు. అయితే.. భారీగా ఆస్తినష్టం ఉంటుందని తెలుస్తుంది.
Next Story