స్కూళ్లో భారీ అగ్ని ప్రమాదం
Massive Fire Breaks Out at Ankur School. గుజరాత్ రాష్ట్రంలోని ఓ పాఠశాలలో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.
By Medi Samrat Published on
9 April 2021 8:10 AM GMT

గుజరాత్ రాష్ట్రంలోని ఓ పాఠశాలలో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. వివరాళ్లోకెళితే.. అహ్మదాబాద్‌లో కృష్ణనగర్‌లోని అంకూర్ పాఠశాలలో షార్ట్ సర్క్యూట్ కారణంగా గ్రౌండ్ ఫ్లోర్‌లో మంటలు చెలరేగాయి. దీంతో ఒక్కసారిగా స్కూల్ అంతా భారీగా పొగ కమ్ముకుంది. హఠాత్తు ఘటనతో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు ఆందోళనకు గురయ్యారు.
వెంటనే స్కూల్ యాజమాన్యం ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. స్థలానికి చేరుకొన్న ఫైర్ సిబ్బంది ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మంటల్లో చిక్కుకున్న ఐదుగురిని రక్షించారు. అయితే.. ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని, ఉద్యోగులు, విద్యార్థులందరినీ భవనం నుంచి తరలించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Next Story