Viral Video : పేలిన‌ అగ్నిపర్వతం.. అంతా 'మ‌సి'

ఫిలిప్పీన్స్‌లోని కన్లోన్ అగ్నిపర్వతంలో సోమవారం భారీ పేలుడు సంభవించింది.

By Kalasani Durgapraveen  Published on  10 Dec 2024 1:08 PM IST
Viral Video : పేలిన‌ అగ్నిపర్వతం.. అంతా మ‌సి

ఫిలిప్పీన్స్‌లోని కన్లోన్ అగ్నిపర్వతంలో సోమవారం భారీ పేలుడు సంభవించింది. దీని కారణంగా, సుమారు 87,000 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ పేలుడు కారణంగా ఆకాశంలో వేలాది మీటర్ల మేర బూడిద వ్యాపించింది. చాలా కిలోమీటర్ల దూరం నుండి తీసిన దృశ్యాలు ఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి. ఫిలిప్పీన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వోల్కనాలజీ అండ్ సిస్మోలజీ ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది.

అగ్నిపర్వతం విస్ఫోటనం చెంది భారీ బూడిద ప్లూమ్, చాలా వేడిగా ఉండే వాయువు, చెత్త ఆకాశంలోకి ఎగిరింది. సెంట్రల్ నీగ్రోస్ ద్వీపంలోని మౌంట్ కన్లోన్ విస్ఫోటనం వల్ల ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.. అయితే హెచ్చరిక స్థాయిని ఒక స్థాయి పెంచారు.. ఈ హెచ్చ‌రిక పేలుడు విస్ఫోటనాలు సాధ్యమేనని సూచిస్తుంది.

ఫిలిప్పీన్స్ చీఫ్ అగ్నిపర్వత శాస్త్రవేత్త టెరెసిటో బాకోల్కోల్, ఇతర అధికారులు టెలిఫోన్ ద్వారా మాట్లాడుతూ.. పురాతన ప్రావిన్స్‌తో సహా, అగ్నిపర్వతానికి పశ్చిమాన సముద్రం మీదుగా 200 కిలోమీటర్ల (124 మైళ్ళు) కంటే ఎక్కువ దూరం అగ్నిపర్వత బూడిద పడింద‌న్నారు.

ఫిలిప్పీన్స్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రకారం.. కన్లోన్ విస్ఫోటనం కారణంగా ఈ ప్రాంతంలో కనీసం ఆరు దేశీయ విమానాలు, సింగపూర్‌కు ఒక విమానం రద్దు చేయబడ్డాయి. రెండు స్థానిక విమానాలు సోమవారం, మంగళవారం మళ్లించబడ్డాయి.

అగ్నిప‌ర్వ‌తానికి స‌మీపంలో ఉన్న దాదాపు 47,000 మంది ప్రజలను 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న నీగ్రోస్ ఆక్సిడెంటల్‌లోని లా కాస్టెల్లానా పట్టణంతో స‌హా సమీపంలో ఉన్న పట్టణాలు, గ్రామాలలోకి త‌ర‌లించారు. పెద్ద సంఖ్యలో స్థానభ్రంశం చెందిన గ్రామస్తులకు సహాయం అందించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారని.. సాంఘిక సంక్షేమ కార్యదర్శి మంగళవారం తెల్లవారుజామున బాధిత ప్రాంతానికి వెళ్లారని అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ తెలిపారు. అదే సమయంలో విషపూరిత అగ్నిపర్వత వాయువుల నుండి కాలుష్యం ముప్పు కారణంగా ప్రభుత్వ శాస్త్రవేత్తలు గాలి నాణ్యతను పర్యవేక్షిస్తున్నారు. అధికారులు పాఠశాలలను మూసివేసి, అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధించారు.

Next Story