సుదీర్ఘ ప్రేమ నిరీక్షణ.. చివరకు 65 ఏళ్ల వయసులో పెళ్లి.!

Married to a Mysore couple at the age of 65 years. ఏళ్లు గడుస్తున్న కొద్దీ నిజమైన ప్రేమ మరింత అర్థవంతంగా మారుతుంది. అందుకు నిదర్శనం వారిద్దరి పెళ్లే. సుధీర్ఘ నిరీక్షణ తర్వాత వారి ప్రేమ

By అంజి  Published on  3 Dec 2021 9:11 AM IST
సుదీర్ఘ ప్రేమ నిరీక్షణ.. చివరకు 65 ఏళ్ల వయసులో పెళ్లి.!

ఏళ్లు గడుస్తున్న కొద్దీ నిజమైన ప్రేమ మరింత అర్థవంతంగా మారుతుంది. అందుకు నిదర్శనం వారిద్దరి పెళ్లే. సుధీర్ఘ నిరీక్షణ తర్వాత వారి ప్రేమ ఫలించింది. 65 ఏళ్ల వయస్సులో ఇద్దరు ఒక్కటయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. చిక్కన్నా, జయమ్మలు మైసూరులోని హెబ్బాళ్ల ప్రాంతానికి చెందిన నివాసితులు. వీరిద్దరికి ఒకరంటే మరొకరికి చాలా ప్రేమ. అయితే కొన్ని కారణాల వల్ల జయమ్మకు యుక్త వయస్సులోనే మరో వ్యక్తితో పెళ్లి అయ్యింది. ఆ తర్వాత చిక్కన్నా.. తన ప్రేయసి దక్కలేదన్న బాధతో మరేవరిని తన జీవితంలోకి రానియకుండా ఒంటరిగా మిగిలిపోయాడు. అప్పటి నుండి జయమ్మ స్మృతిలోనే జీవిస్తూ వచ్చాడు.

కొంత కాలానికి జయమ్మ భర్త చనిపోయాడు. ఆమెకు ఎలాంటి సంతానం కలగలేదు. అప్పటి నుండి ఇద్దరూ తమ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ వేర్వేరుగా ఉంటూ వచ్చారు. తాజాగా వాళ్లు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. కట్టుబాట్లను కాదని మేలుకోటె చెలువనారాయణుడి ఆలయం ఎదురుగా ఉన్న సెలివరాయస్వామి ఆలయంలోని ఆశ్రమంలో ఇద్దరి వివాహం జరిగింది. 65 ఏళ్ల వయస్సులో వీరిద్దరూ పెళ్లి చేసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత పెళ్లి కొడుకు.. పెళ్లి కూతురికి అరుంధతీ నక్షత్రం చూపించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Next Story