కాల్పుల విరమణపై మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం
తెలంగాణ - ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు కూంబింగ్ ముమ్మరం చేసిన వేళ మావోయిస్టు పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik
కాల్పుల విరమణపై మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం
తెలంగాణ - ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు కూంబింగ్ ముమ్మరం చేసిన వేళ మావోయిస్టు పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు నెలల పాటు కాల్పులు విరమిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ అగ్రనేత జగన్ పేరిట లేఖ విడుదలైంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు, ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాలు, మెజార్టీ రాజకీయ పార్టీలు మావోయిస్ట్ పార్టీకి, ప్రభుత్వానికి నడుమ శాంతి చర్చలు జరగాలనే డిమాండ్‌ను ప్రముఖంగా చేస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టికొని మా నుండి 6 నెలల వరకు కాల్పుల విరమణను పాటిస్తున్నామని ప్రకటించుచున్నాము. అని లేఖలో పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో శాంతి చర్చల కమిటీతో శాంతి చర్చలు జరపాలని పీపుల్స్ వార్ డిమాండ్ చేసింది. కగార్ ఆపరేషన్ ను రద్దు చేసి శాంతి చర్చలు జరపాలని తాము డిమాండ్ చేశామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పిందని, సీపీఐ కగార్ ఆపరేషన్ రద్దు కార్యక్రమాలు చేపట్టిందన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో శాంతి చర్చలు జరపాలని తీర్మానం కూడా చేసిందని జగన్ గుర్తు చేశారు.
శాంతి చర్చల డిమాండ్ హర్షించదగింది... తమతో శాంతి చర్చలు జరపాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారని మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ నాయకురాలు కవిత డిమాండ్ చేయడం హర్షించతగిందని జగన్ పేర్కొన్నారు. శాంతి చర్చలు జరపాలని మేధావులు, ప్రజాస్వామిక వాదులు కోరుతున్న నేపథ్యంలో తాము వారి ప్రయత్నాలకు సానుకూలంగా ఆరు నెలల పాటు కాల్పుల విరమణను ప్రకటిస్తున్నామని మావోయిస్టులు ప్రకటించారు.