కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న దండకారణ్యంలో మళ్లీ అలజడి రేగింది. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ధర్బా వద్ద పోలీస్ క్యాంపుపై మావోయిస్టులు మెరుపు దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. బస్తర్ ఐజీ పీ సుందర్‌రాజ్ తెలిపిన వివరాల మేరకు.. ధర్బా సమీపంలోని జైగుర్ క్యాంపుపై ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో మావోయిస్టులు దాడి చేశారన్నారు.
అండర్ బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్లు (బిజిఎల్)తో క్యాంపును ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. తుపాకులతోనూ కాల్పులు జరిపారు. మెరుపుదాడి నుంచి తేరుకున్న భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరపడంతో మావోయిస్టులు అక్కడి నుంచి తప్పించుకున్నారు. ఈ దాడిలో నలుగురు జవాన్లు గాయపడ్డారు. వీరిలో ఇద్దరు జవాన్ల పరిస్థితి విషమంగా ఉంది. వీరిని హెలీకాప్టర్‌లో రాయ్‌పూర్ ఆస్పత్రికి తరలించిన్లు చెప్పారు. ఘటనా స్థలానికి అదనపు బలగాలను రప్పించారు. ప్రస్తుతం మావోయిస్లుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.