ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది విద్యార్థులు మృతి.. మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్‌

Many students feared dead, several injured in bus accident in Manipur. మణిపూర్‌లోని నోనీ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బుధవారం ఉదయం

By అంజి  Published on  21 Dec 2022 4:14 PM IST
ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది విద్యార్థులు మృతి.. మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్‌

మణిపూర్‌లోని నోనీ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బుధవారం ఉదయం విద్యార్థులతో వెళ్తున్న రెండు బస్సులు అదుపు తప్పి బోల్తా పడ్డాయి. దీంతో 15 మంది విద్యార్థులు చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే అధికారిక మరణాల సంఖ్య ఇంకా ధృవీకరించబడలేదు. నోనీ జిల్లాలోని లాంగ్‌సాయి టుబుంగ్ గ్రామ సమీపంలో బిస్నుపూర్-ఖౌపుమ్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. విద్యార్థులను తీసుకువెళుతున్న రెండు బస్సులు యారిపోక్‌లోని తంబలను హయ్యర్ సెకండరీ స్కూల్‌కు చెందినవి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, యైరిపోక్‌లోని తంబల్ను హయ్యర్ సెకండరీ స్కూల్‌కు చెందిన సుమారు 36 మంది విద్యార్థులు, సిబ్బందితో ప్రయాణిస్తున్న బస్సు ఉదయం 11 గంటలకు ఇంఫాల్‌కు నైరుతి దిశలో 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న నుంగ్‌సాయి గ్రామం వద్ద ప్రమాదానికి గురైంది. బస్సులు స్టడీ టూర్ కోసం ఖౌపుమ్ వైపు వెళ్తున్నాయి. గాయపడిన విద్యార్థులను ఇంఫాల్‌లోని మెడిసిటీ ఆసుపత్రికి తరలిస్తున్నారు. నివేదికల ప్రకారం.. ఇప్పటివరకు 22 మంది విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. ఇదిలావుండగా, రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సపమ్ రంజన్ సింగ్ కూడా ప్రమాద స్థలాన్ని సందర్శించారు. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని నోనీ జిల్లాకు చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

"ఈరోజు ఓల్డ్ కాచర్ రోడ్ వద్ద పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న బస్సు ప్రమాదం గురించి విని చాలా బాధపడ్డాను. మణిపూర్ బస్సు ప్రమాదంలో రెస్క్యూ ఆపరేషన్ కోసం ఎస్‌డిఆర్‌ఎఫ్, వైద్య బృందం, ఎమ్మెల్యేలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు." అని మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ బస్సు ప్రమాద వీడియోతో పాటు ట్వీట్ చేశారు.


Next Story