యూపీలో కొత్త రకం వ్యాధి.. 10 మంది మృతి..!
Many kids diagnosed with new mystery fever in Western UP.కరోనా మహమ్మారి నుంచి ఇంకా పూర్తిగా కోలుకోక ముందే
By తోట వంశీ కుమార్ Published on 2 Sep 2021 2:30 AM GMTకరోనా మహమ్మారి నుంచి ఇంకా పూర్తిగా కోలుకోక ముందే మరో కొత్త రకం వ్యాధి వ్యాప్తి చెందుతూ కలకలం రేపుతోంది. గత కొద్ది రోజులుగా ఈ వ్యాధి బారిన చాలా మంది చిన్నారులు పడినట్లు తెలుస్తోంది. పలువురు చిన్నారులు మృత్యవాడ పడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని మథురలో ఈ వ్యాధి వ్యాప్తి చెందుతున్నట్లు జిల్లా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రచన గుప్తా తెలిపారు. దీన్ని స్ర్కబ్ టైఫస్ గా వైద్య నిపుణులు గుర్తించారు.
కోహ్ అనే గ్రామంలో 26 మంది ఈ స్ర్కబ్ టైఫస్ వ్యాధి బారీన పడ్డారని రచన గుప్తా తెలిపారు. పిప్రోత్‌లో 3, రాల్‌లో 14, జసోడాలో 17 మందికి ఈ వ్యాధి సోకిందన్నారు. ఈ వ్యాధి కారణంగా పది మరణించినట్లు చెప్పారు. 10 మందిలో 8 మంది చిన్నారులే ఉండడం గమనార్హం. ఆగ్రా, ఫిరోజాబాద్, మెయిన్‌పురి, ఎటా, కస్గంజ్ జిల్లాలో వ్యాధి సోకి మరణాలు కూడా సంభవించాయని తెలిపారు. ఆయా ప్రాంతాల నుంచి అధికారులు నమూనాలు సేకరిస్తున్నారని వెల్లడించారు.
స్ర్కబ్ టైఫస్ వ్యాధి అంటే ఏంటీ? లక్షణాలు ఎలా ఉంటాయి ?
స్క్రబ్ టైఫస్ అనేది ఓరియెంటియా త్సుత్సుగముషి అనే బ్యాక్టీరియా వల్ల వ్యాపిస్తుంది. చిగ్గర్స్ అనే పురుగు కాటు ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది. దీన్ని 'ష్రబ్ టైఫస్' అని కూడా పిలుస్తారు.
చిగ్గర్స్ పురుగు కాటుకు గురైన వారిలో 10రోజుల వరకు విపరీతమైన జ్వరం, ముక్కు కారడం, ఒళ్లు నొప్పులు, కండరాల నొప్పులు, ఒళ్లంతా దద్దుర్లు పుట్టడం లాంటి లక్షణాలు ఉంటాయి. వ్యాధి బారిన పడిన వారి నుంచి దూరంగా ఉండాలని చెప్పింది. చిన్నారుల శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులను వాడాలని సూచించింది. ఈ వ్యాధి నివారణకు ప్రస్తుతం ఎటువంటి టీకాలు అందుబాటులో లేవని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) తెలిపింది.