మంత్రి ప‌దవుల‌కు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ రాజీనామా

Manish Sisodia, Satyendar Jain quit as ministers. ఆమ్ ఆద్మీ పార్టీ నేత‌లు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు

By Medi Samrat  Published on  28 Feb 2023 6:56 PM IST
మంత్రి ప‌దవుల‌కు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ రాజీనామా

ఢిల్లీ స‌ర్కార్‌లో బాగ‌స్వాములైన‌ ఆమ్ ఆద్మీ పార్టీ నేత‌లు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వారి రాజీనామాలను ఆమోదించారు. రెండు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు జైలు శిక్ష విధించినట్లయితే.. సిసోడియా, జైన్ తమ స్థానాలను కోల్పోవచ్చు.. ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయలేరు. దేశ రాజధానిలో 2021–22కి సంబంధించి రద్దు చేసిన మద్యం పాలసీని రూపొందించి అమలు చేయడంలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ సిసోడియాను సిబిఐ అరెస్టు చేసింది. మనీలాండరింగ్ కేసులో సత్యేందర్ జైన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గత ఏడాది మేలో అరెస్టు చేసింది. సిసోడియా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. విద్యతో సహా ప‌లు ఉన్నత స్థాయి పోర్ట్‌ఫోలియోలను నిర్వహించారు. సత్యేందర్ జైన్ ఢిల్లీ ఆరోగ్య మరియు జైళ్ల మంత్రిగా ఉన్నారు. వీరిద్ద‌రిని ప‌ద‌వుల‌లో కొన‌సాగించ‌డంపై బీజేపీ తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దిగుతుంది. ఈ నేప‌థ్యంలో ఇరువురు రాజీనామా చేయ‌డం.. అధ్య‌క్షుడు ఆమోదించ‌డం రాజ‌కీయంగా సంచ‌ల‌నంగా మారింది.



Next Story