తెలంగాణలో 'ఆపరేషన్ లోటస్‌'కు రుజువు ఉంది: మనీష్ సిసోడియా

Manish Sisodia said that there is proof of 'Operation Kamalam' in Telangana. తెలంగాణలో బీజేపీ ఆపరేషన్ కమలం అమలు చేసిందనడానికి ఆప్ కు రుజువు వచ్చిందని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి

By అంజి  Published on  30 Oct 2022 4:55 AM GMT
తెలంగాణలో ఆపరేషన్ లోటస్‌కు రుజువు ఉంది: మనీష్ సిసోడియా

తెలంగాణలో బీజేపీ ఆపరేషన్ కమలం అమలు చేసిందనడానికి ఆప్ కు రుజువు వచ్చిందని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అన్నారు. భారతీయ జనతా పార్టీలో చేరిన వ్యక్తిని ఏ దర్యాప్తు లేదా కేంద్ర ఏజెన్సీలు వెంటాడవని మనీష్ సిసోడియా అన్నారు. కాషాయ పార్టీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని, ఇతర పార్టీలకు చెందిన శాసనసభ్యులను కొనుగోలు చేసి, తద్వారా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చివేస్తోందని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.

సిసోడియా మాట్లాడుతూ.. అక్టోబర్ 28న ఆప్‌కి కాల్ రికార్డింగ్ దొరికిందని, అందులో బిజెపి సహాయకుడు (రామచంద్ర భారతి), దాని ఏజెంట్‌గా వ్యవహరిస్తూ, భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ''టీఆర్ఎస్ (ప్రస్తుతం బీఆర్‌ఎస్) ఎమ్మెల్యేలకు డబ్బులు, కార్లు ఇస్తామని భారతి బహిరంగంగా చెబుతున్నారని.. మిమ్మల్ని బీఎల్ సంతోష్‌ను కలుస్తామని భారతి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు ఆడియోలో చెప్పారు'' అని సిసోడియా ఆరోపించారు. బీజేపీలో చేరితే ఏ ఏజెన్సీలు మిమ్మల్ని వెంటాడవని భారతి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో శనివారం విలేకరుల సమావేశంలో అన్నారు.

బీజేపీ ఆపరేషన్ లోటస్‌ను అమలు చేస్తోందని, ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ముగ్గురు బీజేపీ సహచరులు ఇటీవల రూ.100 కోట్ల నగదుతో పట్టుబడ్డారని అన్నారు. దేశంలో ఆపరేషన్ కమలం పేరుతో బీజేపీ డర్టీ గేమ్ ఆడుతోందని, అక్టోబరు 27న సైబరాబాద్‌లో సోదాలు నిర్వహించగా, రూ.100 కోట్ల నగదుతో ఆపరేషన్ లోటస్‌లో ముగ్గురు మధ్యవర్తులు పట్టుబడ్డారని అరెస్టయిన ముగ్గురి చిత్రాలను చూపుతూ సిసోడియా తెలిపారు. "ఈ డబ్బు వారికి ఎవరు ఇస్తున్నారు?" అని సిసోడియా ప్రశ్నించారు. ఇది నిజమైతే, ఇది దేశానికి ప్రమాదకరం అని ఆయన అన్నారు.

ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన స్కామ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు సిసోడియా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే సీబీఐ అనేక గంటలపాటు సిసోడియాను ప్రశ్నించింది. కేంద్ర సంస్థలలో పారదర్శకతపై సిసోడియా పదేపదే అభ్యంతరాలు లేవనెత్తారు. తనను కేంద్ర సంస్థలు లక్ష్యంగా చేసుకున్నాయని ఆరోపించారు.

Next Story