కాంగ్రెస్ కు బిగ్ షాక్.. పీసీసీ చీఫ్ రాజీనామా

Manipur congress president resigns.వ‌చ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న మ‌ణిపూర్‌లో కాంగ్రెస్ పార్టీకి భారీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 July 2021 1:19 PM IST
కాంగ్రెస్ కు బిగ్ షాక్.. పీసీసీ చీఫ్ రాజీనామా

వ‌చ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న మ‌ణిపూర్‌లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మణిపూర్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (ఎంపీసీసీ) అధ్యక్ష పదవికి గోవిందాస్ కొంతౌజమ్ రాజీనామా చేశారు. ఆయనతో పాటు మరో 8 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మంగళవారం బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మణిపూర్ కాంగ్రెస్‌లో సంక్షోభం నెలకొంది. ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్తుండటంతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.

గత కొద్ది రోజులుగా గోవిందాస్ తో పాటు 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా త్వరలో పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇక ఇపుడు ఆ వార్తలు నిజమయ్యాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పట్టు కోల్పోయిన నేపథ్యంలో ఇప్పుడు మణిపూర్ లో జరిగిన సంఘటన పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగించింది. దాంతో మణిపూర్ లో పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ పెద్దలు ఎలాంటి చర్యలు తీసుకాబోతున్నారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

కాగా.. వచ్చే ఏడాదిలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో బీజేపీ ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టింది. ఆ రాష్ట్రాల్లో అధికారం చేజిక్కింకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇతర పార్టీల నేతలను బీజేపీలోకి ఆకర్షిస్తోంది. ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్‌ను బలహీన పర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కీలక నేతలే టార్గెట్‌గా రాజీకీయాలు చేస్తోంది. ఇప్పటికే ఈ ఐదు రాష్ట్రాల్లో చాలా వరకు కాంగ్రెస్ కార్యకర్తలు, బీజేపీలోకి చేరిపోయారు. తాజాగా మణిపూర్ పీసీసీ ఛీప్ కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి కమలం తీర్థం పుచ్చుకుంటున్నారు. మరి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టి వలసను కట్టడి చేస్తోందేమో చూడాలి.

Next Story