భార్య విడాకులు కోరడంతో.. ఆమె ప్రైవేట్ వీడియోలు ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన భర్త
గుజరాత్ అహ్మదాబాద్‌లోని ఓ వ్యక్తి తన భార్య విడాకులు కోరడంతో ఆమె ప్రైవేట్ వీడియోలను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు.
By Knakam Karthik Published on 3 Feb 2025 9:58 AM IST
భార్య విడాకులు కోరడంతో..ఆమె ప్రైవేట్ వీడియోలు ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన భర్త
గుజరాత్ అహ్మదాబాద్‌లోని ఓ వ్యక్తి తన భార్య విడాకులు కోరడంతో ఆమె ప్రైవేట్ వీడియోలను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. ఆ మహిళ కంప్లయింట్ మేరకు అతడిపై కేసు నమోదు చేశారు. ఇద్దరికి వివాహమై ఏడాది గడిచినా ఈ జంట కొంతకాలంగా విడివిడిగా జీవిస్తున్నారు. వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొన్న ఆ మహిళ తన తల్లిదండ్రుల దగ్గర ఉంటోంది. ఈ క్రమంలోనే ఆమె విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే ఆ నిర్ణయాన్ని తన భర్తకు తెలియజేసింది. ప్రతీకారంగా ఆమె భర్త తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఆమె సన్నిహిత ఫొటోలు, వీడియోలను అప్‌లోడ్ చేసి అసభ్యకరమైన కామెంట్లతో పోస్టు చేశాడు.
అయితే భార్యాభర్తలిద్దరూ ఒకే ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్‌ను ఉపయోగిస్తున్నారు. దానిని వారి సంబంధిత ఫోన్ల నుంచి యాక్సెస్ చేస్తున్నారు. ఆమె తన తల్లిదండరుల ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఆమె భర్త ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను యాక్సెస్ చేస్తున్నాడు. అయితే ఓ సందర్భంలో ఇద్దరు వీడియో కాల్‌లో కాంటాక్ట్ అయ్యారు. ఆ క్రమంలో తాను ఎదుర్కొంటున్న స్కిన్ అలెర్జీ సమస్యను వీడియో కాల్ ద్వారా అతనికి చూపించింది. దీంతో అతను ఆమెను రోగి అంటూ పిలిచి, కాల్‌ను అకస్మాత్తుగా ముగించాడు. అనంతరం కమ్యూనికేషన్ లేకుండా పోయింది.
పెళ్లయి ఏడాది గడిచిన ఈ జంట కొంతకాలంగా విడివిడిగా జీవిస్తున్నారు. వివాహంలో ఇబ్బందులు ఎదుర్కొన్న మహిళ తన తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వచ్చింది. ఈ విడిపోయిన తర్వాత, ఆమె విడాకులు తీసుకోవాలనే తన నిర్ణయాన్ని తన భర్తకు తెలియజేసింది. ప్రతీకారంగా, అతను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆమె సన్నిహిత చిత్రాలు మరియు వీడియోలను అప్‌లోడ్ చేసి, అసభ్యకరమైన వ్యాఖ్యలతో పంచుకున్నాడు.
ఈ పరిణామాల తర్వాత ఆ మహిళ తిరిగి భర్త దగ్గర వెళ్లకూడదని నిర్ణయించుకుని, అధికారికంగా విడాకులు కోరింది. దీంతో ఆమె భర్త ఆ ప్రైవేట్ వీడియోలను ఆన్‌లైన్‌లో పోస్టు చేశాడు. ఈ విషయాన్ని గుర్తించిన ఆమె వెంటనే గుజరాత్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో అతడిపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 351(2), 356(2).. IT చట్టంలోని సెక్షన్లు 66(e), 67 కింద క్రిమినల్ బెదిరింపు, అవమానించడం , పరువు నష్టం కింద కేసు నమోదు చేశారు.