వెంటిలేటర్ మీద ఆక్సిజన్ మాస్కుతో ఉన్నా కూడా.. దాన్ని మాత్రం వదలలేకపోయాడు

Man on a Ventilator With Oxygen Mask on Makes Khaini.ఆక్సిజన్ సపోర్ట్ తో వెంటిలేటర్ మీద ఉన్న ఓ వ్యక్తి ఖైనీని వదలలేకపోయాడు.

By Medi Samrat  Published on  23 April 2021 1:09 PM GMT
man ventilater

గుట్కా-ఖైనీ.. పొగాకు పదార్థానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని వైద్యులు చెబుతూ ఉంటారు. ప్రతి సినిమా ముందు కూడా గుట్కా-ఖైనీ లాంటివి తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం అని చెబుతూ ఉంటారు. అయినా వాటిని వదిలిపెట్టలేరు. ప్రస్తుతం పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా కారణంగా ఎంతో మంది ఆసుపత్రి బెడ్ల మీద కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. అలా ఆక్సిజన్ సపోర్ట్ తో వెంటిలేటర్ మీద ఉన్న ఓ వ్యక్తి ఖైనీని వదలలేకపోయాడు. ఖైనీని నోట్లోకి తీసుకునే ముందు ఎలాగైతే చేస్తారో.. అలా అతడు చేతులను చేస్తూ ఉన్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది.

గాలి కూడా పీల్చుకోలేని పరిస్థితుల్లో బాధపడుతున్న ఓ వ్యక్తి శరీరానికి అన్ని పైపులే ఉన్నాయి. ఓ నర్సు వచ్చి అతని ఆరోగ్య పరిస్థితిని చూస్తుండగా.. మరొకరు అతని పాదాల వద్ద ఉండి గమనిస్తూ ఉన్నారు. ఆ సదరు వ్యక్తి చేతులు మాత్రం ఖైనీ తయారు చేసే విధానాన్ని చూపిస్తూ ఉన్నాయి. అతడి చేతిలో నిజంగానే ఖైనీ ఉందా అనే విషయం వీడియోలో కనపడలేదు కానీ.. ఖైనీని నోట్లో పెట్టుకునే ముందు చేసే పనినే అతడు చేస్తూ ఉన్నాడు.


Next Story
Share it