ఫ్రెండ్స్‌తో పందెం.. 150 మోమోలు తిన్న యువకుడు మృతి
ఫ్రెండ్స్‌తో చేసిన ఛాలెంజ్.. చివరికి ఆ యువకుడి ప్రాణాలనే తీసింది. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో జరిగింది.
By అంజి Published on 16 July 2023 2:15 AM GMTఫ్రెండ్స్‌తో పందెం.. 150 మోమోలు తిన్న యువకుడు మృతి
ఫ్రెండ్స్‌తో చేసిన ఛాలెంజ్.. చివరికి ఆ యువకుడి ప్రాణాలనే తీసింది. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో జరిగింది. గోపాల్‌గంజ్ జిల్లాలో ఒక వ్యక్తి ఒకేసారి కనీసం 150 మోమోలు తినాలని స్నేహితులు విసిరిన 'మోమో ఛాలెంజ్' స్వీకరించి మరణించాడని, అతను తింటుండగానే మధ్యలో స్పృహ కోల్పోయాడని పోలీసులు శనివారం తెలిపారు. మృతుడు జిల్లాలోని థావే పోలీస్ స్టేషన్ పరిధిలోని సిహోర్వా గ్రామానికి చెందిన విష్ణు మాంఝీ కుమారుడు విపిన్ కుమార్ మాంఝీ (25)గా గుర్తించారు. జిల్లాలోని గ్యానీ మోర్‌లో మాంఝీ మొబైల్ ఫోన్ల మెకానిక్ దుకాణం కలిగి ఉన్నాడు.
అతని మృతదేహం గ్యానీ మోర్ సమీపంలో కనుగొనబడింది. “కనీసం 150 మోమోలు తినాలని మోమోస్ ఈటింగ్ ఛాలెంజ్‌లో మాంఝీ పాల్గొన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. పెద్దమొత్తంలో మోమోలు తిన్న తర్వాత అతని ఆరోగ్యం క్షీణించింది. అతను నేలపై కుప్పకూలిపోయాడు. ఈ ఘటనపై షాపు యజమాని, అతని ఇద్దరు స్నేహితులు మాకు సమాచారం అందించారు. మేము వెంటనే అతన్ని సదర్ ఆసుపత్రిలో చేర్చాము, అక్కడ అతను చికిత్స సమయంలో మరణించాడు, ”అని థావే పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో శశి రంజన్ చెప్పారు.
ఈ ఘటన గురువారం సాయంత్రం జరిగిందని ఆయన తెలిపారు. పోస్టుమార్టం నిర్వహించి మృతదేహానికి అప్పగించామని తెలిపారు. ఇదిలా ఉండగా, అతడి స్నేహితులు విషం కలిపిన ఆహారం ఇచ్చారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు.