పోలీస్ స్టేషన్‌లో భర్త, అతని మైనర్ భార్య ఆత్మహత్య
బీహార్ అరారియా జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 18 May 2024 4:12 PM ISTపోలీస్ స్టేషన్‌లో భర్త, అతని మైనర్ భార్య ఆత్మహత్య
బీహార్ అరారియా జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. తారాబరి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి భార్య గత ఏడాది చనిపోయింది. ఇక అతను చేసేదేం లేక తన భార్య చెల్లిని ఇటీవల వివాహం చేసుకున్నాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే... ఆమె వయసు 14 ఏళ్లు. నిజానికి 18 ఏళ్ల లోపు అమ్మాయిల వివాహాలు చట్ట రిత్యా నేరం. కానీ.. అతను పెళ్లి చేసుకున్నాడు. గత మంగళవారం ఈ వివాహం జరిగింది.
అయితే.. ఈ వివాహం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకున్నారు. మైనర్ బాలికను, ఆమెను పెళ్లి చేసుకున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. గురువారం వారిని పోలీసులు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిపై దాడి చేశారనీ తెలిసింది. ఇక పోలీసులు అరెస్ట్ చేయడం.. లాకప్‌లో దాడి చేయడంతో మనస్తాపం చెందారు. దాంతో.. ఆ దంపతులు లాకప్‌లోనే సూసైడ్ చేసుకున్నారు. భార్య, అతని మైనర్ భార్య సూసైడ్ చేసుకున్న విషయాన్ని గ్రామస్తులు, బంధువులు తెలుసుకున్నారు. ఆ తర్వాత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆందోళనకు దిగారు.
పోలీస్ స్టేషన్ వద్ద నిరసన వ్యక్తి చేస్తూ విధ్వంసానికి దిగారు. పోలీస్ స్టేషన్‌కు నిప్పు పెట్టారు. తారాబరి పోలీస్ స్టేషన్ చుట్టుముట్టి పోలీస్ సిబ్బందిపైకి రాళ్లు విసిరారు. దాంతో.. వారు మిగతా పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. పెద్ద ఎత్తున పోలీసులు అక్కడికి వచ్చారు. ఆందోళన కారులను అదుపు చేశారు. కానీ.. అప్పటికే విధ్వంసం జరిగింది. పోలీస్ స్టేషన్‌కు నిప్పంటించడంతో కొంత భాగం కాలిపోయింది. ఐదుగురు పోలీసులు గాయపడ్డారు. స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి.