సైలెంట్ గా ఉండండి.. వీల్ చైర్ లో వచ్చి ప్రచారం చేస్తాను..!

Mamata releases message from hospital, says, 'Please be calm'.మమతా తన మీద దాడి జరిగిందని కార్యకర్తలు ఎటువంటి ప్రతి దాడులు చేయకండని కోరారు.

By Medi Samrat
Published on : 11 March 2021 3:27 PM IST

Mamata releases message from hospital, says, Please be calm
అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై దాడి జరిగిందని, ఆమె కాలికి పూర్తిగా గాయ‌మైంద‌ని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు చెబుతున్నారు. ఆమె కాలికి గాయం అయింద‌ని తెలుపుతూ ఆమె కాలికి పెద్ద క‌ట్టుక‌ట్టి ఉన్న ఫొటోను వైర‌ల్ చేస్తున్నారు. అయితే, ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప్ర‌చారం, ఓట‌ర్ల సానుభూతి పొందడం కోస‌మే ఆమె ఇటువంటి గిమ్మిక్కులు చేస్తున్నార‌ని ప్ర‌తిప‌క్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.


ఇలాంటి సమయంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. తన మీద దాడి జరిగిందని కార్యకర్తలు ఎటువంటి ప్రతి దాడులు చేయకండని కోరారు. అందరూ ప్రశాంతంగా ఉండాలని ఆమె వీడియోలో కోరారు. ఎన్నికల ప్రచారానికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా తాను ప్రచారంలో పాల్గొంటానని ఆమె అన్నారు. కొద్దిగా రెస్ట్ తీసుకున్న తర్వాత వీల్ ఛైర్ లో కూర్చొని కావాలంటే సభలకు హాజరవుతానని మమతా బెనర్జీ వీడియోలో చెప్పారు. నిన్న జరిగిన దాడిలో తనకు కాలిలో చాలా నొప్పి వచ్చిందని అన్నారు. ప్రస్తుతం కూడా ఎంతో నొప్పిని భరిస్తూ ఉన్నానని వీడియోలో తెలిపారు. తల, ఎద భాగాల్లో కూడా నొప్పిగా అనిపించిందని చెప్పుకొచ్చారు.

అనుచరులు, కార్యకర్తలు సంయమనం పాటించాలని ఆమె కోరారు. ఇతరులకు ఇబ్బందులు కలిగించేలా ఎటువంటి పనులు కూడా చేయకూడదని ఆమె కోరారు. తాను కూడా రెండు, మూడు రోజుల్లో తన పనులను తిరిగి చేయుకుంటానని అన్నారు. తన మీటింగ్ లను రద్దు చేయాల్సిన అవసరం లేదని.. వీల్ ఛైర్ లో ఉండి కావాలంటే సమావేశాల్లో పాల్గొంటానని ఆమె అన్నారు. దయచేసి ఎవరినైనా ఇబ్బంది పెట్టింటే క్షమించమని ఆమె కోరారు.


Next Story