బెంగాల్‌లో హింస ప్లాన్ ప్రకారం చేశారు.. అమిత్ షా పై మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

By Knakam Karthik
Published on : 16 April 2025 2:49 PM IST

National News, West Bengal, Cm Mamata Banerjee, Bengal violence, Amit Shah

బెంగాల్‌లో హింస ప్లాన్ ప్రకారం చేశారు..అమిత్ షా పై మమతా సంచలన వ్యాఖ్యలు

బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వక్స్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌లో జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారడంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రమేయం ఉందని ఆరోపించారు. ఇది ఒక ప్లాన్ ప్రకారం జరిగిన హింస అని.. ఇందుకోసం అమిత్ షా, బీఎస్ఎఫ్ కలిసి కుట్ర పూరితంగా బంగ్లాదేశీయులను రాష్ట్రంలో వదలారని మమతా బెనర్జీ ఆరోపించారు. దర్యాప్తు సంస్థలను ఆయుధంగా చేసుకుని ప్రతిపక్ష నేతలను భయపెట్టాలని ప్రయత్నిస్తున్నారంటూ సీఎం మమతా దుయ్యబట్టారు. సొంత రాజకీయ అజెండాను నెరవేర్చుకోవడానికి దేశానికి హాని చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రధాని మోడీ.. అమిత్ షాను నియంత్రించాలని కోరారు.

కోల్‌కతాలో ముస్లిం మతాధికారులతో జరిగిన సమావేశంలో, వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా పోరాటంలో తమ పార్టీ ముందంజలో ఉందని టీఎంసీ అధ్యక్షురాలు వారికి హామీ ఇచ్చారు. అయితే శాంతియుత నిరసనలు చేపట్టాలని వారిని కోరారు. నేను ప్రధానమంత్రిని కోరుతున్నాను. అమిత్ షా ను ఆయన అదుపులో పెట్టాలి. ఆయన అన్ని ఏజెన్సీలను ఉపయోగించి మనపై కుట్రలు పన్నుతున్నారు. మోడీ జీ లేనప్పుడు ఏం జరుగుతుంది?" అని మమత అన్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పంపిన నివేదిక ప్రకారం, అల్లర్లపై ప్రాథమిక దర్యాప్తులో బంగ్లాదేశ్ దుండగుల ప్రమేయం ఉన్నట్లు తేలింది. హింస చెలరేగిన జిల్లాలు బంగ్లాదేశ్ సరిహద్దును దాటి ఉన్నాయి.బెంగాల్ వెంబడి 2,200 కి.మీ బంగ్లాదేశ్ సరిహద్దును కాపాడుతున్న బిఎస్ఎఫ్, పొరుగు దేశం నుండి దుండగులను లోపలికి అనుమతించడానికి కారణమని మమత ఆరోపించారు. ముర్షిదాబాద్ హింసలో బంగ్లాదేశ్ ప్రమేయం ఉందని హోం మంత్రిత్వ శాఖ చెప్పినట్లు ఒక నివేదిక చూశాను. ఇది నిజమైతే, కేంద్రమే బాధ్యత వహించాలి. సరిహద్దును బిఎస్‌ఎఫ్ జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇంతటి సంక్షోభాన్ని బిఎస్‌ఎఫ్ ఎందుకు నివారించలేదు?" అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.

అయితే వక్ఫ్ సవరణ చట్టం వక్ఫ్ చట్టం ఆమోదంపై జరిగిన నిరసనల సందర్భంగా బెంగాల్‌లోని ముర్షిదాబాద్, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో విస్తృత హింస చెలరేగడంతో ముగ్గురు మరణించగా, అనేక మంది గాయపడ్డారు. మృతుల్లో సంషేర్‌గంజ్‌లో ఒక గుంపు తండ్రీకొడుకులను నరికి చంపింది. హింసలో మరణించిన ముగ్గురు వ్యక్తుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.

Next Story