ఇదేందీ ఇది దీదీ.. నేనెక్క‌డా సూడ‌లే.. నొప్పిఏమైంది..?

Mamata Banerjee shaking injured leg video viral.తాజాగా మ‌మ‌త‌కు సంబంధించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ వీడియోలో గాయమైన‌ కాలిని ఊపుతూ క‌నిపించారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 April 2021 1:08 PM IST
Mamata Banerjee shaking injured  leg

ప‌శ్చిమబెంగాల్ రాజ‌కీయాలు ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా ఆకర్షిస్తున్నాయి. ఎలాగైన స‌రే బెంగాల్‌లో పాగా వేయాల‌ని క‌మ‌ల‌ద‌ళం చూస్తుండ‌గా.. మ‌రోసారి తానే అధికార పీఠాన్ని అధిరోహించాల‌ని ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ ప‌ట్టుద‌ల‌గా ఉంది. అయితే.. ఇటీవ‌ల నందిగ్రామ్‌లో నామినేష‌న్ వేసి తిరిగి వ‌స్తుండ‌గా మ‌మ‌త బెన‌ర్జీకి ప్ర‌మాదం జ‌ర‌గ‌డంతో ఆమె కాలికి గాయ‌మైన సంగ‌తి తెలిసిందే. ఆమె కాలికి డాక్ట‌ర్లు పెద్ద క‌ట్టు క‌ట్టారు. అయితే.. నొప్పిని సైతం లెక్క‌చేయ‌కుండా ఆమె వీల్‌చైర్‌లోనే కూర్చొని ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటుంది.

అయితే.. తాజాగా మ‌మ‌త‌కు సంబంధించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. సాధారణంగా కాలికి గాయ‌మై అంత పెద్ద క‌ట్టుకోవాల్సి వ‌స్తే దాన్ని క‌దప‌కూడ‌దు. ఈ వీడియోలో మ‌మ‌తా బెన‌ర్జీ మాత్రం గాయమైన‌ కాలిని ఊపుతూ క‌నిపించారు. ఆమె రెండు కాళ్లను వెనకకు, ముందుకు ఆడిస్తూ ఓ టేబుల్ వ‌ద్ద వీల్ చైర్‌లో కూర్చున్నారు. ఓ కాలిని మ‌రో కాలిపై వేసుకుని మ‌రీ కూర్చున్నారు. దీంతో కాలికి గాయమైన‌ట్లు ఆమె డ్రామాలు ఆడుతున్నార‌ని మ‌రోసారి బీజేపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. అయితే.. ఈ ఘ‌ట‌న ఎక్క‌డ జ‌రిగిందో తెలీదు కానీ.. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇక క‌మ‌ల‌నాథులు.. దీదీపై విమ‌ర్శ‌నాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. మ‌రోవైపు ఇదీ దీదీ.. నేనెక్క‌డా సూడ‌లే.. నొప్పిఏమైంది..? అంటూ నెటీజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.



Next Story