ఆవు దూసుకొచ్చి ఢీ కొంటే ప‌రిహారం వారు చెల్లిస్తారా..? : మ‌మ‌తా బెన‌ర్జీ

Mamata Banerjee mocks Centre's 'Cow Hug Day' notification. వాలెంటైన్స్ డే నాడు ఫిబ్ర‌వ‌రి 14న‌ ప్ర‌జ‌లు ఆవును కౌగిలించుకునే దినంగా పాటించాల‌ని

By M.S.R  Published on  13 Feb 2023 8:45 PM IST
ఆవు దూసుకొచ్చి ఢీ కొంటే ప‌రిహారం వారు చెల్లిస్తారా..? : మ‌మ‌తా బెన‌ర్జీ

వాలెంటైన్స్ డే నాడు ఫిబ్ర‌వ‌రి 14న‌ ప్ర‌జ‌లు ఆవును కౌగిలించుకునే దినంగా పాటించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్‌ జారీ చేసింది. ఫిబ్ర‌వ‌రి 14ను కౌ హ‌గ్ డేగా పాటించాల‌ని భార‌త జంతు సంక్షేమ బోర్డు నోటిఫికేష‌న్ జారీ చేసి ఆపై దాన్ని ఉప‌సంహ‌రించుకుంది. కేంద్ర ప్ర‌భుత్వం జారీ చేసిన నోటిఫికేష‌న్‌లో భార‌త సంస్కృతి, గ్రామీణ ఆర్ధిక వ్య‌వ‌స్ధ‌కు ఆవు వెన్నెముక‌ని, ఆవును మనం కామ‌ధేనువుగా, గోమాత‌గా భావించి పూజిస్తామని తెలిపింది.

దీనిపై ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ మండిప‌డ్డారు. ప్ర‌జ‌ల్ని ఆవులు పొరపాటున గుద్దితే ఏమ‌వుతుందో తెలుసా అంటూ ఆమె కేంద్రాన్ని ప్రశ్నించారు. ఆవు మ‌న మీదికి దూసుకొచ్చి ఢీ కొంటే ప‌రిహారం వారు (బీజేపీ) చెల్లిస్తారా అని దీదీ ప్ర‌శ్నించారు. పలువురు నేతలు కూడా దీనిపై విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ఈ నోటిఫికేష‌న్‌కు కేంద్ర మంత్రులు, బీజేపీ నేత‌లు, హిందూ సంఘాలు మ‌ద్ద‌తు ప‌లికారు.


Next Story