పెళ్లి వేడుకలో చిందేసిన మమతా బెనర్జీ

Mamata Banerjee Dances With Tribals.పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ మరోసారి కాలు కదిపారు.

By Medi Samrat  Published on  2 Feb 2021 5:59 PM IST
Mamata Banerjee Dances With Tribals.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ మరోసారి కాలు కదిపారు. మంగళవారం నాడు మాల్దా జిల్లాలో స్థానిక యువతీ, యువకులు నిర్వహించిన సామూహిక పెళ్లి వేడుకలో పాల్గొన్న మమతా బెనర్జీ గిరిజనులతో కలిసి డాన్స్ చేస్తూ ఉత్సాహంగా గడిపారు. ఈ పెళ్లి వేడుకలో 300 మంది గిరిజన జంటలు ఒక్కటయ్యాయి. ఈ వేడుకకు మమతా బెనర్జీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం గిరిజన మహిళలతో కలిసి జానపధ పాటలకు కాలు కదిపారు.


అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇంత ఉల్లాసంగా, ఉత్సాహంగా దీదీ కనిపించడం చాలా అరుదు. భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఓ వైపు ఇబ్బందులను పెడుతూ ఉంటే.. తాజాగా చిందేసి అందరినీ ఆశ్చర్య పరిచారు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ నుంచి మరో ఎమ్మెల్యే తప్పుకున్నాడు. డైమండ్ హార్బర్ శాసనసభ్యుడు దీపక్ హల్దార్ టీఎంసీ పార్టీని వీడారు. నియోజకవర్గంలో పని చేసేందుకు తనను అనుమతించడంలేదని హల్దార్ రాజీనామా సందర్భంగా చెప్పుకొచ్చారు. టీఎంసీ నుంచి వైదొలగిన కాసేపటికే హల్దార్ బీజేపీలో చేరారు. 24 పరగణాల జిల్లాలోని బరూయ్ పూర్ లో జరిగిన ఓ సభలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు.

హల్దార్ రాజీనామా చేయడం వల్ల పార్టీకి ఎలాంటి నష్టం లేదని తృణమూల్ కాంగ్రెస్ చెప్పుకొచ్చింది. అతడికి రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ టికెట్ ఇవ్వాలనుకోలేదని, టీఎంసీ టికెట్ ఇవ్వదన్న విషయం తెలిసే అతడు పార్టీ నుంచి వెళ్లిపోయాడని తెలిపాయి తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు.


Next Story