రెచ్చిపోయిన మావోయిస్టులు.. మందు పాతర పేలుడు

Maiosts Blast Landmine chhattisgarh .. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. ఛత్తీస్‌గఢ్‌ లో అధికంగా

By సుభాష్  Published on  1 Dec 2020 7:06 AM GMT
రెచ్చిపోయిన మావోయిస్టులు.. మందు పాతర పేలుడు

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. ఛత్తీస్‌గఢ్‌ లో అధికంగా సంచరించే మావోయిస్టులు బీజాపూర్‌ జిల్లా బాసగూడెం పోలీసు స్టేషన్‌ పరిధిలో తర్రెం వద్ద మందు పాతరలు పేల్చారు. రహదారిపై వెళ్తున్న వాహనాన్ని లక్ష్యంగా చేసుకున్న మావోయిస్టులు ఈ ఘటనకు పాల్పడడారు. ఈ మందుపాతర పేలుడులో ఇద్దరు గ్రామస్తులు గాయపడ్డారు. ఈ పేలుడులో వాహనం తీవ్రంగా దెబ్బతింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉండగా, పోలీసు ఇన్ఫార్మర్‌ అనే నెపంతో ఇద్దరు గ్రామస్తులను మావోయిస్టులు దారుణంగా హతమార్చారు. బీజాపూర్‌ జిల్లాలోని గంగుళూరు పోలీసు స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటన స్థలంలో మావోయిస్టులు ఓ లేఖను వదిలి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

Next Story
Share it