మహారాష్ట్ర మాజీ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ఏడాది తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు. అనిల్ దేశ్‌ముఖ్‌కు ఏడాది జైలు శిక్ష తర్వాత ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలు నుంచి ఈరోజు విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఆయన మద్దతుదారులు ఘన స్వాగతం పలికారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నమోదు చేసిన అవినీతి కేసులో అనిల్ దేశ్ ముఖ్ నిందితుడిగా ఉన్నారు. బెయిల్ కోసం ఆయన పలు మార్లు కోర్టులను ఆశ్రయించారు. అనిల్ దేశ్‌ముఖ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నవంబర్ 2021లో అరెస్టు చేసింది. అతను రాష్ట్ర హోం మంత్రిగా తన పదవిని దుర్వినియోగం చేసాడని.. కొంతమంది పోలీసు అధికారుల ద్వారా ముంబైలోని వివిధ బార్‌ల నుండి ₹ 4.70 కోట్లు వసూలు చేసినట్లు ఈడీ పేర్కొంది.
దేశ్‌ముఖ్‌ను 2021 నవంబర్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్టు చేసింది. అతను రాష్ట్ర హోం మంత్రిగా ఉన్న సమయంలో తన పదవిని దుర్వినియోగం చేశారని, కొంతమంది పోలీసు అధికారుల ద్వారా ముంబయిలోని వివిధ బార్, హోటళ్ల నుండి రూ. 4.70 కోట్లు వసూలు చేశారనే ఆరోపణ ఉంది.