ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. జూన్ 1 వ‌ర‌కు ఆంక్ష‌ల పొడిగింపు

Maharashtra extended the lockdown. కరోనా కేసుల దృష్ట్యా లాక్‌డౌన్ త‌ర‌హా ఆంక్ష‌ల‌ను మ‌రోమారు పొడిగిస్తూ ప్ర‌భుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 May 2021 5:15 PM IST
Maharashtra extended the lockdown

దేశ వ్యాప్తంగా క‌రోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. దేశంలో అన్ని రాష్ట్రాల్లో కంటే మ‌హారాష్ట్ర‌లో క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య విప‌రీతంగా పెరుగుతుండ‌డంతో మ‌హారాష్ట్ర అల్లాడిపోతుంది. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలో క‌రోనా క‌ట్ట‌డి కోసం అమ‌లు చేస్తోన్న ఆంక్ష‌లు మ‌రికొన్ని వారాల పాటు కొన‌సాగ‌నున్నాయి. కరోనా కేసుల దృష్ట్యా లాక్‌డౌన్ త‌ర‌హా ఆంక్ష‌ల‌ను మ‌రోమారు పొడిగిస్తూ ప్ర‌భుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా జూన్ 1వ తేదీ ఉద‌యం 10 ఏడు గంట‌ల వ‌ర‌కు ఈ క‌ఠిన ఆంక్ష‌లు అమ‌లులో ఉంటాయ‌ని ఆదేశాల్లో పేర్కొంది.

మ‌హ‌మ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు.. మహారాష్ట్రలో గ‌త నెల 5న లాక్‌డౌన్ తరహా ఆంక్షలు విధించారు. 22 రోజుల‌పాటు ఆంక్ష‌లు కొన‌సాగుతాయ‌ని ప్ర‌క‌టించింది. అవి ఏప్రిల్ 28న ముగియ‌డంతో దానిని మే 15 వరకు పొడిగించింది. క‌రోనా కేసులు పెరుగుతుండ‌టంతో రాష్ట్రంలో పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ విధించాల‌ని డిమాండ్ వ‌స్తున్న నేప‌థ్యంలో.. బుధవారం కేబినెట్ స‌మావేశ‌మైంది. ఈ సమావేశంలో ఆరోగ్య మంత్రిత్వశాఖతో పాటు ఇత‌ర‌ మంత్రులు లాక్‌డౌన్‌ను మరో 15 రోజులు అంటే మే చివరి వరకు పొడిగించాలని ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ మేర‌కు సీఎం ఉద్ధవ్ థాకరే ఈ నిర్ణయం తీసుకున్నారు.

గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో మ‌హారాష్ట్ర‌లో 46,781 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. 816 మంది మృతి చెందారు. కాగా.. ఒక్క రోజులో 58,805 మంది కోలుకున్నారు. కొత్త పాజిటివ్ కేసుల కంటే.. రివ‌క‌రీలు ఎక్కువ‌గా ఉండ‌డం ఒక్క‌టే ప్ర‌స్తుతం ఆ రాష్ట్రానికి ఒకింత ఊర‌ట‌నిచ్చే అంశం.




Next Story