కాలి బొటన వేలితో బొట్టు పెట్టిన దివ్యాంగురాలు.. ఉద్వేగానికి గురైన డిప్యూటీ సీఎం
ఓ దివ్యాంగురాలు చూపించిన ఆదరాభిమానానికి మహారాష్ట్ర డిప్యుటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భావోద్వేదానికి లోనయ్యారు.
By అంజి Published on 28 Jun 2023 8:00 AM GMTకాలి బొటన వేలితో బొట్టు పెట్టిన దివ్యాంగురాలు.. ఉద్వేగానికి గురైన డిప్యూటీ సీఎం
ఓ దివ్యాంగురాలు చూపించిన ఆదరాభిమానానికి మహారాష్ట్ర డిప్యుటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భావోద్వేదానికి లోనయ్యారు. రాష్ట్రంలోని జలగావ్ ప్రాంతంలో ప్రత్యేక అవసరాలున్న వ్యక్తుల కోసం దీపస్తంభ్ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఓ యువతి తిలకం దిద్దారు. వికలాంగురాలిగా ఉన్న యువతి నేలపై కూర్చొని ఉంటే డిప్యుటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆమెతో పాటే నేలపై కూర్చున్నారు. అప్పుడా యువతి కాలి బొటన వేలితో ప్లేట్‌లోంచి తిలకం తీసి మహారాష్ట్ర డిప్యుటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నుదుటిన పెట్టింది. ఆ తర్వాత హారతి ఇచ్చింది. ఈ క్రమంలో చోటుచేసుకున్న సన్నివేశంతో ఆయన కళ్లు చెమర్చాయి. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు అందర్ని ఆకట్టుకుంటున్నాయి.
''ఇప్పటి వరకు ఎందరో తల్లులు, సోదరీల నుంచి నేను ఆశీర్వాదం తీసుకున్నారు. తిలకం స్వీకరించాను. ఇప్పుడు కూడా నాకు తిలకం దిద్దేందుకు ఓ సోదరి బొటనివేలు నా నుదిటి మీదకు చేరింది. అయితే, అది చేతి వేలు కాదు.. కాలి బొటనవేలు. జీవితంలో జరిగే ఇలాంటి క్షణాలు ఒక్కసారిగా ఉద్వేగానికి గురిచేస్తాయి. మన కళ్లు చెమర్చేలా చేస్తాయి. ఈ సోదరి నాకు తిలకం దిద్ది, అదే వేళ్లతో హారతి ఇచ్చింది. అప్పుడు ఆమె ముఖంలో చిరునవ్వు, కళ్లల్లో ఒకరకమైన మెరుపు కనిపించింది. ‘నాకు ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే.. నాకు ఎవరి జాలి, దయ అవసరం లేదు. ఆ పరిస్థితులను దాటుకొని వెళ్తాను’ అని ఆ మెరుపును చూస్తే నాకనిపించింది'' అని డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ ట్వీట్ చేశారు. అలాగే ప్రతిపోరాటంలో ఆ యువతిని అండగా ఉంటానని భరోసా కల్పించారు.
आज तक कई माताओं-बहनों ने आशीर्वाद स्वरूपी आरती की, तिलक लगाया। आज भी उसी भावना के साथ एक अंगूठा मेरे माथे पर तिलक लगाने के लिए पहुंचा... पर इस बार ये हाथ का नहीं पांव का अंगूठा था। जीवन में आने वाले ऐसे क्षण झकझोर देते हैं, आँखों को नम कर देते हैं, पर सिर्फ कुछ पल के लिए।… pic.twitter.com/pqpqeO3Kbo
— Devendra Fadnavis (@Dev_Fadnavis) June 27, 2023