మహారాష్ట్రలో ఘోర ప్రమాదం సంభవించింది. ఆదివారం ఉదయం నాగ్‌పూర్ బజార్‌గావ్ గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. సోలార్ ఇండస్ట్రీస్ కంపెనీలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. కంపెనీలోని క్యాస్ట్ బూస్టర్ ప్లాంట్‌లో ప్యాకింగ్ సమయంలో సడెన్‌గా భారీ పేలుడు జరిగింది. ప్రమాదం సమయంలో అక్కడ ఉన్న 9 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ సంఘటనలో మరికొందరు కార్మికులకు గాయాలు అయ్యాయయని సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ కంపెనీ వర్గాలు తెలిపాయి. పేలుడు గురించి సమాచారం తెలుసుకున్న వెంటనే ఎమర్జెన్సీ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రమాద తీవ్రత ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు ప్రమాదం గురించి తెలుసుకున్న ఉన్నతాధికారులు ఘటనాస్థలాన్ని పరిశీలించేందుకు వెళ్లారు. గాయపడ్డ వారిని వెంటనే దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పేలుడు శబ్ధం వినగానే స్థానికులు కూడా కొంత ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందా అని తెలుసుకునేందుకు కంపెనీ వద్దకు పరుగులు తీశారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు.