ఘోర ప్రమాదం, ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ప్రైవేట్‌ బస్సు, ఐదుగురు దుర్మరణం

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం సంభవించింది.

By Srikanth Gundamalla  Published on  16 July 2024 9:55 AM IST
Maharashtra, accident, five killed, 45 injured ,

ఘోర ప్రమాదం, ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ప్రైవేట్‌ బస్సు, ఐదుగురు దుర్మరణం

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం సంభవించింది. ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌ వేపై సోమవారం అర్ధరాత్రి దాటిని తర్వాత ఈ ఘోరం చోటుచేసుకుంది. కేసర్ నుంచి పండరీపూర్‌కు వెళ్తున్న ఓ ప్రయివేట్‌ బస్ఉ ఎక్స్‌ప్రెస్‌వేపై ట్రాక్టర్‌ను వేగంగా వచ్చి ఢీకొట్టింది. దాంతో.. అదుపుతప్పి రెండు వాహనాలు లోయపడిపోయాయి. ఈ ప్రమాదంలో సంఘటనాస్థలిలోనే ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 45 మందికి గాయాలు అయ్యాయి. అయితే.. సంఘటన గురించి సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు, సహాయక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. క్షతగాత్రులకు సాయం చేశారు. సహాయక చర్యల్లో స్థానికుల కూడా పాల్గొన్నారు. గాయపడ్డ వారిని స్థానికుల సాయంతో పోలీసులు ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నట్లు వైద్యులు వెల్లడించారు.

ఈ ఘోర రోడ్డు ప్రమాదం గురించి నవీ ముంబై డీసీపీ వివేక్‌ పన్సరే మాట్లాడారు. వివరాలను వెల్లడించారు. ప్రమాదం రాత్రి ఒంటి గంట సమయంలో చోటుచేసుకుందని చెప్పారు. ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితులను పర్యవేక్షించినట్లు చెప్పారు. బాధితులంతా ఆషాడ ఏకాదశి సందర్భంగా పండరీపూర్‌ వెళ్తున్నారనీ.. ఆ సమయంలోనే బస్సు ప్రమాదానికి గురైందని చెప్పారు. క్షతగాత్రుల్లో 42 మందిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా.. ముగ్గురిని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తున్నామని డీసీపీ డీసీపీ వివేక్‌ పన్సరే అన్నారు.

Next Story