మహారాష్ట్రలో కుప్పకూలిన హెలికాప్టర్‌.. ముగ్గురు మృతి

మహారాష్ట్రలో హెలికాప్టర్‌ ప్రమాదం జరిగింది. పుణెలోని బవధాన్‌ ప్రాంతంలో హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.

By అంజి  Published on  2 Oct 2024 10:25 AM IST
Maharashtra, helicopter crash, Bavdhan, Pune

మహారాష్ట్రలో కుప్పకూలిన హెలికాప్టర్‌.. ముగ్గురు మృతి

మహారాష్ట్రలో హెలికాప్టర్‌ ప్రమాదం జరిగింది. పుణెలోని బవధాన్‌ ప్రాంతంలో హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. హెలికాప్టర్‌ పూర్తిగా దగ్ధమైంది.

పూణే జిల్లాలోని బావధాన్ సమీపంలో బుధవారం ఉదయం హెలికాప్టర్ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. పింప్రి చించ్వాడ్ పోలీసు కమిషనర్ ఈ వార్తను ధృవీకరించారు. "ఈ సంఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. పింప్రి చించ్వాడ్ పోలీసు సీనియర్ అధికారులు సంఘటనా స్థలంలో ఉన్నారు" అని ఆయన తెలిపారు.

ఘటన జరిగిన కొద్దిసేపటికే రెండు అంబులెన్స్‌లు, నాలుగు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సమీపంలో ఉన్న హెలిప్యాడ్ నుండి హెలికాప్టర్ టేకాఫ్ అయిన తర్వాత బవ్‌ధాన్ ప్రాంతంలోని కొండ భూభాగంలో బుధవారం ఉదయం 6:45 గంటలకు ఈ సంఘటన జరిగింది.

నివేదికల ప్రకారం, హెలికాప్టర్‌లో ఇద్దరు పైలట్లు, ఒక ఇంజనీర్ సహా ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story