నూపుర్ శర్మను ర‌క్షించేందుకు 18 లక్షల మంది నాగ సాధువులు వీధుల్లోకి : మహంత్ బాలక్ దాస్

Mahant Balak Das says 18 Lakh Naga Sadhus will take to the streets to protect Nupur Sharma.ఇస్లాంవాదులు ఇలాగే గొడవలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 Jun 2022 9:31 AM IST
నూపుర్ శర్మను ర‌క్షించేందుకు 18 లక్షల మంది నాగ సాధువులు వీధుల్లోకి : మహంత్ బాలక్ దాస్

ఇస్లాంవాదులు ఇలాగే గొడవలు చేస్తే నూపుర్ శర్మకు మద్దతుగా 18 లక్షల మంది నాగ సాధువులు వీధుల్లోకి వస్తారని పాతాల్ పూరీ మఠం చీఫ్ మహంత్ బాలక్ దాస్ అన్నారు. ఈ మేర‌కు ఆయ‌న హెచ్చ‌రించిన ఓ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. కాశీలోని ధర్మ పరిషత్‌లో నూపుర్ శర్మకు పలువురు హిందూ దార్శనికులు బహిరంగంగా మద్దతు పలికారు. నూపుర్ శర్మను బెదిరిస్తున్న వారిని పట్టుకుని విచారించాలని వారు నిర్ద్వంద్వంగా చెప్పారు. జూన్ 10, 2022న శుక్రవారం నమాజ్ సందర్భంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో చెలరేగిన హింసను కూడా వారు ఖండించారు. హిందూ మత గురువులు వీధుల్లో కూడా పోరాడతామని ఇస్లామిస్టులను హెచ్చరించారు.


జూన్ 11న వారణాసిలోని హర్‌తీర్థ్ లోని సుధాం కుటీలో ధర్మ పరిషత్ నిర్వహించారు. పాతాళ పూరీ మఠం ప్రధానార్చకుడు మహంత్ బాలక్ దాస్ సభకు అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి కాశీలోని అనేక మఠాలు, పీఠాలు సహా అఖాడాల ప్రధాన అర్చకులు, నాయకులు, అలాగే అనేక ఇతర హిందూ సాధువులు, ఋషులు హాజరయ్యారు.

ఈ సంద‌ర్భంగా మహంత్ బాలక్ దాస్ విలేకరులతో మాట్లాడుతూ.. 'రోజురోజుకూ అరాచకం విస్తరిస్తోంది. ఇప్పుడు అది కాస్తా శివుడిని ఎగతాళి చేసే స్థాయికి చేరుకుంది, దానిపై వారు జోకులు పేలుస్తున్నారు. వారు దానిని డ్రిల్ చేసి ఫౌంటెన్ అని కూడా పిలిచారు. దీని తరువాత కూడా సనాతన ధర్మాన్ని పాటించే ప్రజలు శాంతిని కొనసాగించారు. అయితే.. ఈ రోజు అది హ‌ద్దులు దాటింది. ఖురాన్‌లో ఏం రాశారో అదే నూపుర్ చెప్పింది. అది కూడా శివునిపై చాలా అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తుంటే ఆమె అవి ప్రస్తావించింది. సనాతనులు శాంతియుతంగా ఉంటారు, అయినప్పటికీ ఈ మతపెద్దలు మసీదుల నుంచి వచ్చి రాళ్లు విసురుతున్నారు. గందరగోళాన్ని వ్యాప్తి చేయమని పిలుపునిస్తున్నారు"అని ఆయన మండి ప‌డ్డారు.

ఇలాగే చేస్తే నూపుర్ శర్మను రక్షించడానికి నాగ సాధువులు వీధుల్లోకి వస్తారని మహంత్ బాలక్ దాస్ హెచ్చరించారు. "ఈరోజు మా ఆడబిడ్డను అత్యాచారం చేస్తామని బెదిరిస్తున్నారు! ఆమెకు ఏదైనా జరిగితే, ఈ సాదు కమ్యూనిటీ చూస్తూ ఉండదని గమనించండి, 18 లక్షల మంది నాగ సాధువులు రోడ్డుపైకి వస్తారు. మొత్తం సాధు సమాజం రోడ్డుపైకి వస్తుందని.. అప్పుడు ఏం జరుగుతుందో ఊహించండి" అని అన్నారు.

Next Story