వచ్చే విద్యా సంవత్సరం వరకు పాఠశాలలు బంద్‌

Madhyapradesh Schools Shut till March 31 .. కరోనా మహమ్మారి కారణంగా పాఠశాలలు మూతపడిన విషయం తెలిసిందే. కరోనా

By సుభాష్  Published on  5 Dec 2020 9:59 AM GMT
వచ్చే విద్యా సంవత్సరం వరకు పాఠశాలలు బంద్‌

కరోనా మహమ్మారి కారణంగా పాఠశాలలు మూతపడిన విషయం తెలిసిందే. కరోనా పూర్తి స్థాయిలో తగ్గకపోవడంతో పాఠశాలలు తెరిచేందుకు ప్రభుత్వాలు సహసించడం లేదు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రానున్న విద్యా సంవత్సరం నాటి వరకు పాఠశాలలను తెరవకూడదని నిర్ణయం తీసుకుంది. కేవలం 10,12వ తరగతుల విద్యార్థులకు మాత్రమే తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. శుక్రవారం ఆ రాష్ట్ర అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహన్‌.. పాఠశాలల బంద్‌ను మార్చి 31 వరకు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు.

1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు నిర్వహించబోమని, వారు చేపట్టిన ప్రాజెక్టు వర్కుల ఆధారంగానే మార్కులు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. కోవిడ్‌ నిబంధనల ప్రకారమే 10,12వ తరగతి విద్యార్థులకు పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. వైరస్‌ పూర్తి స్థాయిలో తగ్గకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

Next Story