మద్యం ప్రియులకు బిగ్‌షాక్.. బార్‌షాపులు, పర్మిట్ రూమ్‌లు పూర్తిగా బంద్
Madhyapradesh cabinet approves new excise policy. మద్యం విక్రయాలు, వినియోగంపై మధ్యప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
By అంజి Published on 20 Feb 2023 12:12 PM ISTమద్యం విక్రయాలు, వినియోగంపై మధ్యప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర క్యాబినెట్ కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం తెలిపింది. దీని కింద మద్యం దుకాణాల వద్ద సిట్టింగ్‌లు, బార్‌లకు అనుబంధంగా ఉన్న మద్యం సేవించే ప్రాంతాలు పూర్తిగా మూసివేయబడతాయి. ఆదివారం సాయంత్రం జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా ఈ విషయాన్ని ప్రకటించారు. మద్యం వినియోగాన్ని తగ్గించేందుకు కొత్త ఎక్సైజ్ పాలసీని రూపొందించినట్లు తెలిపారు.
ఇకపై లిక్కర్ షాపుల్లో మద్యం విక్రయాలు మాత్రమే కొనసాగుతాయి. కూర్చొని మద్యం సేవించేందుకు అనుమతించబోమని మంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. మధ్యప్రదేశ్‌లో "నియంత్రిత మద్యం విధానం" కోసం భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఉమాభారతి డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇది జరిగింది. సంపూర్ణ నిషేధం డిమాండ్‌తో తన ప్రచారాన్ని ప్రారంభించిన భారతి, ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలో మద్యం అమ్మకాలను క్రమబద్ధీకరించాలని కోరుతూ వచ్చారు.
''రాష్ట్రంలో అన్ని మద్యం సిట్టింగ్ ప్రాంతాలు, షాప్ బార్‌లు మూసివేయబడ్డాయి. ఇప్పుడు షాపుల్లో మాత్రమే మద్యం విక్రయించబడుతుంది. మద్యపాన ప్రదేశాలకు అనుమతి లేదు'' అని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి అయిన మిశ్రా మంత్రివర్గ సమావేశం తర్వాత అన్నారు. విద్యాసంస్థలు, బాలికల హాస్టళ్లు, మత స్థలాల నుంచి మద్యం షాపుల దూరాన్ని 50 మీటర్ల నుంచి 100 మీటర్లకు పెంచుతున్నామని, మద్యం తాగి వాహనాలు నడిపితే డ్రైవింగ్ లైసెన్స్‌లను రద్దు చేసే చట్టాన్ని మరింత కఠినతరం చేస్తామన్నారు.
"ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మద్యపానాన్ని నిషేధించేందుకు కృషి చేస్తున్నారు కాబట్టి 2010 నుండి రాష్ట్రంలో కొత్త దుకాణం తెరవలేదు. దీనికి విరుద్ధంగా, దుకాణాలు మూసివేయబడ్డాయి" అని మిశ్రా చెప్పారు. నర్మదా సేవా యాత్ర సందర్భంగా రాష్ట్రంలో 64 దుకాణాలు మూతపడ్డాయని తెలిపారు. ఉమా భారతి మద్యపానానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ఉదారవాద ఎక్సైజ్ పాలన ద్వారా ప్రజల మద్యపాన అలవాటును క్యాష్ చేసుకోవద్దని ఎంపిలో చౌహాన్ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వాన్ని కోరారు.
దేవాలయాలు, రాజభవనాలకు ప్రసిద్ధి చెందిన నివారీ జిల్లాలోని ఓర్చా పట్టణంలోని మద్యం దుకాణం ముందు ఆమె రెండు ఆవులను కట్టివేసి, తన 'మధుశాల మే గౌశాల' (మద్యం విక్రయశాలలో గోశాల) కార్యక్రమంలో పాలు తాగమని, మద్యం తాగవద్దని ప్రజలకు ఉద్బోధించింది. మద్యం అమ్మకాలను నిరసిస్తూ ఓర్చాలో ఉన్న దుకాణంలో పేడను కూడా విసిరింది.