Madhya Pradesh: సచివాలయంలో భారీ అగ్నిప్రమాదం

మధ్యప్రదేశ్‌ సెక్రటేరియట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

By Srikanth Gundamalla
Published on : 9 March 2024 12:15 PM IST

madhya pradesh, secretariat, fire accident,

Madhya Pradesh: సచివాలయంలో భారీ అగ్నిప్రమాదం

మధ్యప్రదేశ్‌ సెక్రటేరియట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాజధాని భోపాల్‌లోని వల్లభ్‌ భవన్‌లో శనివారం ఉదయం 9.30 గంటలకు మంటలు చెలరేగాయి. దాంతో.. సచివాలయం నుంచి భారీగా మంటలు చెలరేగాయి. ఉదయాన్ని సచివాలయానికి చేరుకున్న సిబ్బంది మంటలను గమనించారు. దాంతో.. పోలీసులు, ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఫైరింజన్లతో ఘటనతా స్థలానికి వెళ్లారు. మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.

వల్లభ్‌ భవన్‌లోని మూడో అంతస్తులో ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. సచివాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించిడంతో స్థానికులు, సచివాలయ ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. మంటలు చెలరేగడాన్ని గమనించిన స్థానికులు, ఇతర వాహనదారులు అక్కడి నుంచి పరుగులు తీశారు. సచివాలయంలో మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల ప్రాంతమంతా పొగలు అలుముకున్నాయి. సచివాలయంలో ఎవరైనా ఉద్యోగులు చిక్కుకున్నారా? అనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. అసలు అగ్నిప్రమాదం ఎలా సంభవించింది..? కారణాలేంటి అనేది తెలియరాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రాథమికంగా మాత్రం షార్ట్‌ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కేసు నమోదు చేశామనీ.. దర్యాప్తు తర్వాత అన్ని విషయాలు వెల్లడిస్తామని అధికారులు చెబుతున్నారు.


Next Story