ఆస్పత్రిలో భర్త మృతి.. రక్తంతో తడిసిన బెడ్‌.. గర్భిణీతో శుభ్రం చేయించిన సిబ్బంది

మధ్యప్రదేశ్‌లో ఓ గర్భిణి తన భర్త చనిపోవడంతో రక్తపు మరకలతో ఉన్న ఆసుపత్రి బెడ్‌ను బలవంతంగా శుభ్రం చేయించారు.

By అంజి  Published on  3 Nov 2024 6:58 AM IST
Madhya Pradesh, Pregnant woman, clean hospital bed, husband died

ఆస్పత్రిలో భర్త మృతి.. రక్తంతో తడిసిన బెడ్‌.. గర్భిణీతో శుభ్రం చేయించిన సిబ్బంది

మధ్యప్రదేశ్‌లో ఓ గర్భిణి తన భర్త చనిపోవడంతో రక్తపు మరకలతో ఉన్న ఆసుపత్రి బెడ్‌ను బలవంతంగా శుభ్రం చేయించారు. అక్టోబర్ 31 న జరిగిన ఈ సంఘటన ఆగ్రహాన్ని రేకెత్తించింది. సంఘటన యొక్క వీడియో వైరల్ అయిన తర్వాత పాల్గొన్న వైద్య సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలకు దారితీసింది. దిండోరిలోని చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్.. పలువురు ఆసుపత్రి సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు.

భర్తను కోల్పోయిన 5 నెలల గర్భిణిని తన భర్త రక్తంతో తడిసిన ఆసుపత్రి బెడ్‌ను శుభ్రం చేయమని కోరిన సంఘటన గార్దసరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగింది. ఈ ఘటనపై సర్వత్రా ఖండనలు వెల్లువెత్తడంతో ఆరోగ్య అధికారులు విచారణ చేపట్టారు. మహిళ బంధువులు అధికారికంగా ఫిర్యాదు చేయడంతో, వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక ఫలితాలను అనుసరించి, గార్దసరి ఫెసిలిటీలో ఉన్న మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చంద్రశేఖర్ సింగ్ తదుపరి నోటీసు వచ్చే వరకు కరంజియా కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు బదిలీ చేయబడ్డారు.

అదనంగా నర్సింగ్ ఆఫీసర్ రాజకుమారి మరావి, వార్డు అటెండర్ ఛోటీ బాయి ఠాకూర్‌లను తక్షణమే సస్పెండ్ చేశారు. పాల్గొన్న సిబ్బంది అందరికీ నోటీసులు జారీ చేశామని, తదుపరి చర్య కోసం వారి స్పందనలను జిల్లా మేజిస్ట్రేట్‌కు పంపిస్తామని డాక్టర్ మారవి తెలిపారు.

Next Story