మధ్యప్రదేశ్‌లోని బర్వానీ జిల్లాకు చెందిన ఓ సాధారణ డ్రైవర్ ఆదివారం ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌లో రూ.49 పెట్టుబడి పెట్టి రూ.1.5 కోట్లు గెలుచుకున్నాడు. దీంతో అతడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. గేమింగ్ యాప్‌లో "రూ. 49 కేటగిరీ"లో వర్చువల్ క్రికెట్ జట్టును సృష్టించడం ద్వారా అతను మొదటి స్థానాన్ని పొందడం ద్వారా ఈ మొత్తాన్ని గెలుచుకున్నాడు. షహబుద్దీన్ మన్సూరి అనే వ్యక్తి గత రెండేళ్లుగా ఇలాంటి ఆన్‌లైన్ క్రికెట్ గేమ్‌లలో జట్లను సృష్టించడం ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నట్లు పేర్కొన్నాడు.
ఆదివారం కోల్ కతా, పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా యాప్ లో క్రికెట్ టీమ్ ను ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం, షాహబుద్దీన్ తన యాప్ వాలెట్ నుండి రూ. 1.5 కోట్లలో గెలిచిన మొత్తంలో రూ.20 లక్షలు విత్‌డ్రా చేశాడు. మొత్తం రూ.6 లక్షలు పన్ను మినహాయించగా, అతని బ్యాంకు ఖాతాలో రూ.14 లక్షలు జమ అయ్యాయి. మధ్యప్రదేశ్‌లోని సెంద్వాలో అద్దె ఇంట్లో ఉంటున్న షాబుద్దీన్.. తాను గెలిచిన డబ్బుతో సొంత ఇల్లు కట్టుకోవాలని ప్లాన్ చేసుకున్నాడు. మిగిలిన మొత్తంతో సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని కూడా లక్ష్యంగా పెట్టుకున్నాడు.