మధ్యప్రదేశ్‌లోని రత్లామ్ జిల్లాలో ఆవు ముందు మూత్ర విసర్జన చేశాడనే ఆరోపణతో ఒక వ్యక్తిని దారుణంగా కొట్టి, దుర్భాషలాడిన ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో ఆధారంగా ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. మానక్ చౌక్ పోలీసులు శుక్రవారం రాత్రి నిందితుడు వీరేంద్ర రాథోడ్‌ను ఐపిసి సెక్షన్లు 323 (స్వచ్ఛందంగా గాయపరచడం), 294 (అశ్లీల చట్టం), 506 (నేరపూరిత బెదిరింపు) కింద అరెస్టు చేసినట్లు ఒక అధికారి తెలిపారు.
ఆవు ముందు మూత్ర విసర్జన చేశాడనే ఆరోపణలతో సైఫుద్దీన్ పాట్లీవాలా అనే బాధితుడిని రాథోడ్ కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో వైరల్ కావడంతో.. పోలీసులు బాధితుడిని ట్రాక్ చేశారు. అతని ఫిర్యాదు మేరకు.. నిందితుడిని అరెస్టు చేసినట్లు మానిక్ చౌక్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ సచిన్ దబర్ తెలిపారు. ఆవు ముందు మూత్ర విసర్జన చేశాడని నిందితుడు ఆరోపించడంతో బాధితుడు క్షమాపణలు చెబుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. బాధితుడు పదే పదే క్షమాపణలు చెప్పినప్పటికీ నిందితుడు బాధితుడిని చెంపదెబ్బ కొట్టాడు