కరోనాతో క‌న్నుమూసిన‌ బీజేపీ ఎంపీ.. ప్ర‌ధాని మోదీ సంతాపం

Madhya Pradesh BJP MP Nandkumar Singh Chauhan passes away.కరోనా మహమ్మారి బారిన పడి మధ్యప్రదేశ్‌ బీజేపీ లోక్‌సభ ఎంపీ నందకుమార్ సింగ్ చౌహాన్ తుదిశ్వాస విడిచారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 March 2021 12:31 PM IST
MP Nandkumar Singh Chauhan passes away

ఓ వైపు కరోనా వ్యాక్సినేషన్ మొదలవుతూ ఉన్నా.. కరోనా కారణంగా ఇంకా మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. పలువురు ప్రముఖులు కూడా కరోనా కారణంగా ప్రాణాలను కోల్పోతూ ఉన్నారు. కరోనా మహమ్మారి బారిన పడి మధ్యప్రదేశ్‌ బీజేపీ లోక్‌సభ ఎంపీ నందకుమార్ సింగ్ చౌహాన్ తుదిశ్వాస విడిచారు. ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో గత 15 రోజులుగా ఢిల్లీలోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం కన్నుమూశారు.


ఆయన మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు.పార్టీకి ఆయన లేని లోటు తీరనిది అంటూ ట్వీట్‌ చేశారు. పార్టీ బలోపేతం కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదని అన్నారు. 2009-14మధ్య ఐదేళ్ల కాలంలో తప్ప 1996 నుండి చౌహాన్ లోక్‌సభ ఎంపీగా కొనసాగుతున్నారు. నందకుమార్ మృతిపై బీజేపీ శ్రేణులు, నేతలు విషాదంలో మునిగిపోయారు.


దేశంలో కరోనా వ్యాక్సిన్ రెండో దశ పంపిణీ మొదలైంది. ఈ దశలో వ్యాక్సిన్ కోసం తొలి రోజు దాదాపు 25 లక్షల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో 24.5 లక్షల మంది సాధారణ ప్రజలు ఉన్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. మిగతా వారిలో వైద్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లు ఉన్నట్టు పేర్కొంది. 60 ఏళ్లు పైబడిన వారు, 45 ఏళ్లు దాటి కోమార్బిడిటీస్‌తో బాధపడుతున్న వారు టీకా కోసం కొ-విన్ 2.0 పోర్టల్, ఆరోగ్యసేతు యాప్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.


Next Story