రైలు పట్టాలపై ఎల్‌పిజి సిలిండర్.. ప్లాన్ అదే!!

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలోని పెరంబూర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై ఎల్‌పిజి సిలిండర్ ను ఉంచారు. ఆదివారం తెల్లవారుజామున సిలిండర్ ను గమనించడంతో రైలు ప్రమాదం తృటిలో తప్పింది.

By అంజి  Published on  22 Sept 2024 2:30 PM IST
LPG cylinder, railway track, Kanpur, train, Uttarpradesh

రైలు పట్టాలపై ఎల్‌పిజి సిలిండర్.. ప్లాన్ అదే!! 

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలోని పెరంబూర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై ఎల్‌పిజి సిలిండర్ ను ఉంచారు. ఆదివారం తెల్లవారుజామున సిలిండర్ ను గమనించడంతో రైలు ప్రమాదం తృటిలో తప్పింది. గూడ్స్ రైలు వెళుతుండగా పట్టాలపై సిలిండర్ కనిపించింది, లోకో పైలట్ సకాలంలో బ్రేక్‌లు వేయడంతో పెను ప్రమాదం తప్పింది. సెప్టెంబరు నెలలోనే గుర్తుతెలియని వ్యక్తులు రైళ్లను పట్టాలు తప్పించేందుకు ప్రయత్నించడం ఇది నాలుగోసారి.

సెప్టెంబర్ 8న ప్రయాగ్‌రాజ్‌ నుంచి భివానీకి వెళ్తున్న కాళింది ఎక్స్‌ప్రెస్‌ కాన్పూర్‌లో పట్టాలపై ఉంచిన ఎల్‌పీజీ సిలిండర్‌ను ఢీకొట్టింది. సిలిండర్‌ను ఢీకొన్న తర్వాత రైలు ఆగిపోయింది. పెట్రోల్ బాటిల్, అగ్గిపెట్టెలతో సహా ఇతర అనుమానాస్పద వస్తువులను లోకో పైలట్ గుర్తించాడు. ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా రైళ్లను పట్టాలు తప్పించేందుకు 18 ప్రయత్నాలు జరిగాయని భారతీయ రైల్వే సెప్టెంబర్ 10న నివేదించింది. జూన్ 2023 నుండి ఇప్పటి వరకు, ట్రాక్‌లపై LPG సిలిండర్లు, సైకిళ్లు, ఇనుప రాడ్‌లు, సిమెంట్ దిమ్మెలు వంటి వస్తువులు కనిపించాయి.

Next Story