14 నెలల చిన్నారికి భయంకరమైన జబ్బు.. ప్రాణాలు నిలిపిన 'లాటరీ'
Lottery saved life of a 14 month old baby.ప్రముఖ డ్రగ్ తయారీ సంస్థ నోవార్టిస్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఈ జంట లక్కీ విన్నర్‌గా నిలిచింది
By తోట వంశీ కుమార్ Published on 18 Feb 2021 1:31 PM ISTకొందరు చిన్నారులు అరుదైన వ్యాధుల బారిన పడటంతో ఆ కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. వైద్యానికి అయ్యే ఖర్చు పెట్టేంత స్థోమత లేక నానా అవస్థలకు గురయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. తాజాగా ఓ 14 నెలల చిన్నారికి భయంకరమైన వ్యాధి ప్రబలడంతో తల్లిదండ్రులు చిన్నారి ప్రాణాలపై ఆశలు వదులుకున్నారు. వైద్యానికి సుమారు రూ.16 కోట్ల వరకు ఖర్చు అవుతాయని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. ఇంత డబ్బు పెట్టలేని స్థతిలో ఉండటంతో వారికి ఏం చేయలో తెలియ నిస్సాహయ స్థితిలో ఉండిపోయారు. ఇంతలో వారికి ఓ లాటరీ తగలడంతో చిన్నారి ప్రాణాలు నిలబెట్టుకోగలిగారు. బుడి బుడి నడకలతో ఇల్లంతా సందడి చేసే ఆ చిన్నారికి మరో జీవితం ఇచ్చినట్లయింది.
వివరాల్లోకి వెళితే కర్ణాటకలోని భత్కల్‌కు చెందిన ఓ జంటకు 14 నెలల పాప ఉంది. ఆ పసిపాపకు స్పైనల్ మస్కులర్ అట్రాఫీ (ఎస్‌ఎమ్‌ఏ) అనే అరుదైన వ్యాధి సోకింది. ఈ వ్యాధి చిన్న పిల్లల సామర్థ్యాన్ని దెబ్బ తీస్తుంది. ఈ వ్యాధి ఉన్నవారు నడవడానికి, నిలబడడానికి, కూర్చోవడానికి, తినడానికి, శ్వాస తీసుకోవడానికి, ఇంకా ఆహారం మింగడానికి ఇబ్బందులు పడుతుంటారు. అయితే చిన్నారి తల్లిదండ్రులు సాధ్యమైనంత వరకు బిడ్డను బతికించుకోవడానికి పడిన ఇబ్బందులు అంతా ఇంతా కాదు. పాప వైద్యానికి రూ.16 కోట్ల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. దీంతో షాకైన తల్లిదండ్రులు చిన్నారి ప్రాణాలపై ఆశలు వదులుకున్నారు. మానసికంగా కుంగిపోయారు.
మధ్య తరగతి కుటుంబం అయినా వారి సామర్థ్యానికి మించి వైద్యం చేయించారు. కానీ పాప పూర్తిగా కోలుకోవాలంటే కోట్ల రూపాయలు ఖర్చుఅవుతాయని వైద్యులు చెప్పడంతో ఏమి చేయలేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ క్రమంలో సాక్షాత్తు దేవుడు కరుణించినట్లుగా ఓ 'లాటరీ' వారి జీవితాల్లో వెలుగులు నింపింది. పాప ప్రాణాలను ఓ లాటరీ కాపాడింది.
ప్రముఖ డ్రగ్ తయారీ సంస్థ నోవార్టిస్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఈ జంట లక్కీ విన్నర్‌గా నిలిచింది. దీంతో సదరు సంస్థ వీళ్ల 14నెలల ఫాతిమాకు అవరమైన జాల్గెస్మా థెరఫీ చికిత్సను ఉచితంగా అందిస్తామని భరోసా ఇచ్చారు. వారు చెప్పినట్లుగానే పాప చికిత్సకు ఖర్చులు భరించి ప్రాణాలు నిలబెట్టారు. దీంతో ఆ తల్లిదండ్రు ముఖాల్లో సంతోషం వెల్లవిరిసింది. పాప ప్రాణాలను కాపాడిన ఈ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు.