వారణాసిలో స్వల్ప ఆధిక్యంలోకి ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 4 Jun 2024 4:37 AM GMTవారణాసిలో స్వల్ప ఆధిక్యంలోకి ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచిన విషయం తెలిసిందే. వారణాసిలో ఇప్పటి వరకు వెనుకంజలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. తాజాగా స్వల్ప ఆధిక్యంలోకి వచ్చారు. తాజా సమాచారం ప్రకారం కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ రెండో స్థానంలో ఉన్నారు. 436 ఓట్ల ఆధిక్యంలో ప్రధాని మోదీ లీడింగ్‌లోకి వచ్చారు. ఒకానొక సమయంలో ముందంజలో కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ ఉన్నారు. ప్రధాని మోదీకి ఇప్పటి వరకు 28,719 ఓట్లు పోల్ అవ్వగా.. కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్‌కి 28,283 ఓట్లు పోల్ అయ్యాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఈ వివారాలను వెబ్‌సైట్‌లో లైవ్‌లో ఉంచింది. ఇక ఇదే వారణాసి నుంచి బీఎస్పీ అభ్యర్థిగా ఉన్న ఆథర్ జమల్ మూడో స్థానంలో ఉన్నారు. ఆయనకు కేవలం 3400 ఓట్లు పోల్ అయ్యాయి. ఇక్కడ ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ మధ్య తీవ్ర పోటీ నడుస్తోందని చెప్పాలి.
దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు వేగంగా సాగుతోంది. బీజేపీ 200కు పైగా స్థానల్లో లీడింగ్‌లో కొనసాగుతోంది. కాంగ్రెస్ 80 కి పైగా స్తానాల్లో లీడింగ్‌లో ఉంది. ఈ క్రమంలో పోరు హోరాహోరీగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్డీఏ కూటమి మ్యాజ్ మార్క్‌ను దాటినా.. కాంగ్రెస్ కూటమి కూడా ఎక్కువ స్థానాలను గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.