దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడిలో భాగంగా ఇప్పటికే కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను మరో వారం రోజులు పొడిగిస్తున్నట్లు సీఎం అరవింద్ క్రేజీవాల్ ప్రటకించారు. మే 3(సోమవారం) ఉదయం 5 గంటల వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని సీఎం కేజ్రీవాల్ స్పష్టం చేశారు. నిన్న రికార్డు స్థాయిలో 357 మరణాలు సంభవించాయన్నారు. ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజలతో మాట్లాడినప్పుడు కూడా లాక్‌డౌన్ పొడిగించాలనే కోరారరని తెలిపారు.
ప్రస్తుతం ఢిల్లీలో కరోనా ఆస్పత్రుల్లో పరిస్థితులు దయనీయంగా ఉన్నాయి. ఆక్సిజన్ కొరత ఏర్పడి పదుల సంఖ్యలో రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. జైపూర్ గోల్డెన్ ఆస్పత్రుల్లో ప్రాణవాయువు అందక శుక్రవారం రాత్రి 20 మంది రోగులు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఇక గురువారం కూడా సర్ గంగారామ్‌లో ఆక్సిజన్ సరిపడా లేక 25 మంది చనిపోయారు. ఇక గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 24 వేల పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 357 మంది మరణించారు.