బతికుండగానే దినకర్మ చేసుకున్న వృద్ధుడు.. ఎందుకో తెలిస్తే షాకవుతారు.!
Living person celebrates his death anniversary in Bihar. హిందూ మత సంప్రదాయాల ప్రకారం.. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతడి మరణానంతరం దినకర్మ చేస్తేనే అతని ఆత్మ
By అంజి Published on 6 Nov 2022 11:25 AM GMTహిందూ మత సంప్రదాయాల ప్రకారం.. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతడి మరణానంతరం దినకర్మ చేస్తేనే అతని ఆత్మ మోక్షాన్ని పొందుతుందని నమ్ముతారు. అయితే దీనికి సంబంధించి బీహార్‌లో ప్రత్యేకమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. అక్కడ సజీవంగా ఉన్న వృద్ధుడు తన దినకర్మను నిర్వహించుకున్నాడు. తాను చనిపోయాక.. తన కుటుంబం దినకర్మను చేస్తుందో, చేయదోనని అమానంతో తనకు తానే దినకర్మను నిర్వహించుకున్నాడు. దినకర్మ రోజున ఊరందరినీ ఇంటికి పిలిచి విందు సైతం ఇచ్చాడు.
ఈ ఘటన బిహార్‌లోని ముజఫర్‌పుర్ జిల్లా సక్రా బ్లాక్‌లోని భారతీపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. హరిచంద్ర దాస్ (75) అనే వృద్ధుడు జీవించి ఉండగానే తన దినకర్మను తానే చేసుకున్నాడు. గతేడాది కూడా ఇలానే తన దినకర్మను చేసుకున్నాడు. ఈ కార్యక్రమానికి అతడి బంధువులతో పాటు గ్రామ ప్రజలు హాజరయ్యారు. ఇప్పుడు అతడు దినకర్మ వార్షికోత్సవాన్ని కూడా జరుపుకున్నాడు. హరిశ్చంద్ర దాస్ ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు, తన కుటుంబంతో సహా గ్రామం మొత్తం ఉలిక్కిపడింది. అలా చేయొద్దని కుటుంబ సభ్యులు సహా గ్రామస్థులు ఎంత చెప్పినా.. అతడు పట్టించుకోలేదు.
తర్వాత అందరూ అంగీకరించి సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హరిచంద్ర దాస్ తన వర్ధంతిని పూర్తి ఆచార వ్యవహారాలతో జరుపుకున్నాడు. అనంతరం రాత్రి విందు కూడా ఏర్పాటు చేశాడు. హరిశ్చంద్రదాస్‌కు ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. వారందరికీ వివాహాలు, అతని భార్య కుటుంబంతో నివసిస్తున్నారు. కొడుకులు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. తన కుటుంబానికి , తన పిల్లలకు భారంగా ఉండటం తనకు ఇష్టం లేదని, అందుకే తాను 15 నవంబర్ 2021 లోనే తన శ్రద్ధ కర్మ చేశానని చెప్పాడు. తాను మతపరమైన స్వభావం గలవాడినని, మోక్షాన్ని పొందేందుకు జీవించి ఉండంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిద్దామని నిర్ణయించుకున్నానని చెప్పాడు.