మందుబాబుల‌కు బ్యాడ్ న్యూస్‌.. మూడు రోజులు మూత‌ప‌డ‌నున్న‌ మద్యం దుకాణాలు

హర్యానాలో ఎన్నికల ప్రచారం నిలిచిపోయింది. ఇప్పుడు అక్టోబర్ 5న ఓటింగ్ జరగనుంది.

By Medi Samrat  Published on  3 Oct 2024 2:25 PM GMT
మందుబాబుల‌కు బ్యాడ్ న్యూస్‌.. మూడు రోజులు మూత‌ప‌డ‌నున్న‌ మద్యం దుకాణాలు

హర్యానాలో ఎన్నికల ప్రచారం నిలిచిపోయింది. ఇప్పుడు అక్టోబర్ 5న ఓటింగ్ జరగనుంది. అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు ఉంది. కాగా, ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్రంలో మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఈ మద్య నిషేధం ఉత్తర్వు హర్యానాల‌ని ప్రాంతాలతో పాటు ఇతర పక్క రాష్ట్రాలలో కూడా వర్తించ‌నుంది. హర్యానా ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశం ప్రకారం.. హర్యానాకు ఆనుకుని ఉన్న యూపీ, ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాలలో మద్యం దుకాణాలు మూత‌ప‌డ‌నున్నాయి.

ఇతర రాష్ట్రాల్లో హర్యానా సరిహద్దు నుండి మూడు కిలోమీటర్ల పరిధిలోని దుకాణాలు మూత‌ప‌డ‌నున్నాయి. గురువారం సాయంత్రం నుండి శనివారం సాయంత్రం వరకు దుకాణాలు మూసివేయబడతాయి. దీని తరువాత అక్టోబర్ 8 లెక్కింపు రోజున కూడా ఈ ప్రాంతాల్లో మద్యం అమ్మకాలపై నిషేధం ఉంటుంది. ఇదిలావుంటే.. గాంధీ జయంతి రోజైన బుధవారం దేశవ్యాప్తంగా మద్య నిషేధం అమల్లో ఉంది. ఇక హర్యానా పరిసర ప్రాంతాలలో ఈ రోజుతో చూసుకుంటే.. నాలుగు రోజుల పాటు మద్యం దుకాణాలు మూత‌ప‌డ్డ‌ట్లైంది.

Next Story