పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. బాధితుల కుటుంబాలకు అండగా నిలబడటానికి, త్వరితగతిన డెత్ క్లెయిమ్ పరిష్కారాలను అందించడానికి 'లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' (LIC) ఓ స్పెషల్ విండోను తెరిచింది.
మరణించిన వారి డెత్ క్లెయిమ్‌ను వీలైనంత త్వరగా పరిష్కరించడానికి ప్రత్యేక రాయితీలను కూడా ప్రకటించింది. ఈ ప్రక్రియను ప్రారంభించడానికి, నామినీ అవసరమైన అన్ని పత్రాలను తీసుకొని పాలసీని జారీ చేసిన ఎల్ఐసీ శాఖను సంప్రదించాలని సూచించింది.
నామినీ అవసరమైన పత్రాలతో.. పాలసీ జారీ చేసిన ఎల్ఐసీ బ్రాంచ్‌ను సంప్రదించాలని సూచించింది. పాలసీ నంబర్, తేదీ, మరణించడానికి కారణం వంటి వివరాలతో LIC సర్వీసింగ్ బ్రాంచ్‌కు లిఖితపూర్వకంగా తెలియజేయాలని తెలిపింది.