నిమజ్జనోత్సవంలో పాల్గొనేందుకు వెళ్లిన కుటుంబం.. అనుకోని అతిథి

Leopard Enters Maharashtra House.దుర్గా విగ్రహాల నిమజ్జనోత్సవంలో పాల్గొనేందుకు ఓ కుటుంబం వెళ్లింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Oct 2022 5:30 AM
నిమజ్జనోత్సవంలో పాల్గొనేందుకు వెళ్లిన కుటుంబం.. అనుకోని అతిథి

దుర్గా విగ్రహాల నిమజ్జనోత్సవంలో పాల్గొనేందుకు ఓ కుటుంబం వెళ్లింది. తిరిగి ఇంటికి వ‌చ్చి చూసేస‌రికి వారి ఇంట్లో చిరుత‌పులి క‌నిపించ‌డంతో ఆశ్చ‌ర్యానికి లోనైయ్యారు. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లోని స‌తారాలో జ‌రిగింది.

వివ‌రాలు ఇలా ఉన్నాయి. కోయానగర్‌లో నివ‌సించే ఓ కుటుంబం గురువారం రాత్రి దుర్గామాత విగ్ర‌హాల నిమ‌జ్జ‌నోత్స‌వంలో పాల్గొనేందుకు వెళ్లింది. ఆ స‌మ‌యంలో వారి ఇంట్లో ఓ చిరుత‌పులి చొర‌బ‌డింది. నిమ‌జ్జ‌నం అనంత‌రం ఇంటికి తిరిగి వ‌చ్చిన కుటుంబ స‌భ్యులు గ‌ది త‌లుపులు తెర‌వ‌గా.. ఓ రూమ్ త‌లుపు ద‌గ్గ‌ర పులి కూర్చొని ఉండ‌టాన్ని చూసి షాక్‌కు గుర‌య్యారు.

వెంట‌నే తేరుకున్న వారంతా బ‌య‌ట‌కు వ‌చ్చి ఇంటి త‌లుపులు మూసివేశారు. విష‌యం తెలుసుకున్న ఆ ఊరిలోని వారంతా వ‌చ్చారు. కిటీకీల నుంచి చిరుత‌ను వీడియోలు తీశారు. స‌మాచారం అందుకున్న అట‌వీశాఖ అధికారులు అక్క‌డి చేరుకున్నారు. చిరుత‌పులిని బోనులో బంధించి తీసుకువెళ్లారు.

Next Story