Video: క్ష‌ణం ఆల‌స్యం అయ్యుంటే ఆ కుక్క ప‌రిస్థితి ఏమ‌య్యుండేది..?

రాజస్థాన్‌లోని మౌంట్ అబూలో శుక్రవారం ఓ చిరుతపులి ఇంటి గార్డెన్ ప్రాంతంలోకి ప్రవేశించి పెంపుడు కుక్కపై దారుణంగా దాడి చేసింది.

By Kalasani Durgapraveen  Published on  16 Nov 2024 3:30 AM
Video: క్ష‌ణం ఆల‌స్యం అయ్యుంటే ఆ కుక్క ప‌రిస్థితి ఏమ‌య్యుండేది..?

రాజస్థాన్‌లోని మౌంట్ అబూలో శుక్రవారం ఓ చిరుతపులి ఇంటి గార్డెన్ ప్రాంతంలోకి ప్రవేశించి పెంపుడు కుక్కపై దారుణంగా దాడి చేసింది. CCTV ఫుటేజీలో లాబ్రడార్ రిట్రీవర్ లాగా కనిపించే ఒక నల్ల కుక్క, సన్‌రైజ్ వ్యాలీలోని ఇంటి ముందు నడుస్తూ ఉన్నప్పుడు చిరుతపులి ప్రాంగణంలోని సరిహద్దు గోడను దూకి కుక్కపై దాడి చేసింది.

చిరుతపులి కుక్క మెడను కొరికేస్తూ కనిపించింది. తనను తాను విడిపించుకోవడానికి కుక్క కష్టపడుతూ ఉండడం చూడవచ్చు. ఒక మహిళ కుక్క అరుపు విని కేకలు వేయడం ప్రారంభించి ఇంటి తలుపులు తెర‌వ‌గా చిరుతపులి కుక్కను విడిచిపెట్టి పారిపోయింది. ఆ తర్వాత కుక్క ఆ మహిళతో కలిసి ఇంటి లోపలికి వెళ్లిపోతుంది. ఆ ఇంటిని పేయింగ్ గెస్ట్ అకామిడేషన్‌గా ఉపయోగిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆ ఇంటి యజమానిని మాల కుమారి గా గుర్తించారు.

Next Story