మ‌హిళ‌లు ఇదే మంచి ఛాన్స్ కుమ్మేయండి

Lathmar Holi celebrations in Uttar Pradesh.మ‌థుర జిల్లాలోని బ‌న్సారా లోని ప్ర‌జ‌లు హోళీ పండుగకు ముందు ల‌త్మ‌ర్ హోళీ ని జ‌రుపుకుంటారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 March 2021 7:22 AM GMT
Lathmar Holi celebrations in Uttar Pradesh

భార‌తదేశం విభిన్న సంస్కృతుల సమ్మేళ‌నం. ఒక్కో ప్రాంతంలో ఒక్కో భాష‌, ఒక్కో వేష‌దార‌ణ క‌నిపిస్తుంటుంది. ఒకే పండుగ‌ను అన్ని చోట్ల జ‌రుపుకున్నా భిన్న రీతుల్లో జ‌రుపుకుంటుంటారు. అయితే.. కొన్ని ప్రాంతాల్లో ఆచారాలు క‌ట్టుబాట్లు విచిత్రంగా ఉంటాయి. దేశంలో దాదాపు అన్ని ప్రాంతాల్లో హోళీ పండుగను జ‌రుపుకుంటారు. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా గ‌త ఏడాది కాలంగా కొన్ని పండుగ‌ల‌ను జ‌రుపుకోలేక‌పోయాం. అయితే.. ఈ ఏడాది మాత్రం హోళీ సంబ‌రాలు అప్పుడే మొద‌ల‌య్యాయి. ఈ నేప‌థ్యంలోనే ఉత్త‌రప్ర‌దేశ్ లోని మ‌థుర లో కూడా హోళీ సంబురాలు మొద‌ల‌య్యాయి. అయితే మ‌థుర జిల్లాలోని బ‌న్సారా లోని ప్ర‌జ‌లు హోళీ పండుగకు ముందు ల‌త్మ‌ర్ హోళీ ని జ‌రుపుకుంటారు. అయితే వారి ఆచారాలు మాత్రం ఇత‌రులకు భిన్నంగా ఉంటాయి. వాళ్లు కూడా మొద‌ట రంగులు చ‌ల్లుకుంటూ ఎంజాయ్ చేస్తారు.

అనంత‌రం.. మగవాళ్లని.. అక్క‌డి ఆడ వాళ్లు కర్రలతో కొడతారు. ఆ సమయంలో మగవారు తమకు దెబ్బలు తగులకుండా ఒక పల్లెం లాంటి వస్తువును ఒకదాన్ని అడ్డుగా పెట్టుకుంటారు. ఇక దానిపై ఆడవారు కర్రతో బాదుతారు. మ‌గ‌వాళ్లను ఆడ‌వాళ్లు కొట్ట‌డం ఏదో స‌ర‌దాకోసం కాదు.. అలా చేస్తే చెడు అంత‌రించి అంద‌రికీ మంచి జ‌రుగుతుంద‌ట‌. ఏళ్ల త‌ర‌బ‌డి అక్క‌డి ప్ర‌జ‌లు ఈ ఆచారాన్ని కొన‌సాగిస్తున్నార‌ట‌. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. దీనిపై నెటీజ‌న్లు ఫ‌న్నీగా కామెంట్లు చేస్తున్నారు. మ‌హిళ‌కు ఇదే మంచి ఛాన్స్ కుమ్మేయండి అంటూ ఓ నారీమ‌ణి కామెంట్ పెట్టింది.




Next Story