జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్‌లో ఇండియన్ ఆర్మీ, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు మృతి చెందినట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి. షోపియన్‌లోని జిన్‌పథర్ కెల్లర్ ప్రాంతంలో మంగళవారం ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది.
ఎన్‌కౌంటర్‌లో లష్కర్-ఎ-తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయినట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి. ఈ ఆపరేషన్‌లో భారత సైన్యం, జమ్మూకశ్మీర్ పోలీసులు, పారామిలటరీ దళాలు సంయుక్తంగా పాల్గొన్నాయి. పోషియన్ జిల్లా షుక్రూకెల్లర్ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు సెర్చ్ ఆపరేషన్ చేపట్టినట్లుగా అధికారులు వెల్లడించారు.
ఇటీవల పహల్గాం టెర్రర్ అటాక్‌లో 26 మంది పౌరులు మరణించిన నేపథ్యంలో ఉగ్రవాదుల సంచరిస్తున్న సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతా బలగాలు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నాయి.